https://oktelugu.com/

Peni Naani : పాపం పేర్ని నాని.. ఇలా బుక్కయ్యాడేంటి?

వైసీపీలో ఆయనకు కానీ..ఆయన కుమారుడికి కానీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం బందరు సాక్షిగా  ఊపందుకుంది. ఇప్పుడు జగన్ ను గౌరవించకుండా ఏకవచనంతో సంబోధించడంతో మొదటికే మోసం వచ్చేసిందని చెబుతున్నారు. చూడాలి మరీ జగన్ తన మార్కు స్టైల్ లో పేర్ని నాని పక్కన పెడతారో లేదో..

Written By:
  • Dharma
  • , Updated On : May 24, 2023 / 01:50 PM IST
    Follow us on

    Peni Naani : నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు. ఆ ఊరే మంచిది కాదంటే ఆ ఊర్లో ఉండే వారి నోర్లను అస్సలు ఊహించుకోలేం. ఇప్పడు వైసీపీలో కూడా అటువంటి పరిస్థితే. పక్క పార్టీల్లో ఉండేటప్పుడు పద్ధుతులు పాటించే నాయకులు వైసీపీలోకి వచ్చేసరికి స్వరం మార్చుతున్నారు. నోటికి పని చెబుతున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలతో ఇబ్బందిపడుతున్నారు. చివరికి వారి వ్యక్తిత్వంపై కూడా దెబ్బకొడుతున్నారు. అయితే అదే అలవాటు చేసుకున్న వారు ఇప్పుడు తర, తమ అన్న భేదం చూసుకోవడం లేదు. సొంత వారిపైన కూడా విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు ఆ బాధితవర్గంలో వైసీపీ అధినేత జగన్ సైతం చేరడం విస్మయపరుస్తోంది.
    మొన్నటి బందరు సభలో మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు చూస్తే అధినేత అంటే ఇదేనా గౌరవం అని అనుమానం కలగక మానదు.  పోర్టు శంకుస్థాపనలో ఆయన చేసిన ప్రసంగం మొత్తం తేడాగా ఉంది. జగన్ ను..వైఎస్ ను ఏక వచనంతో సంబోంధించారు. ఇష్టారీతిన మాట్లాడేశారు, అయితే  జగన్ ను పొగడాలన్న క్రమంలో తనకు అలవాటైన మాటలు అనేసి అడ్డంగా బుక్కయ్యారు. ముచ్చటగా చెప్పాలంటే సీఎం జగన్ తన జేబులో మనిషి అని చెప్పే ఆరాటంలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. దీనిపై సీఎంవో అధికారి ధనుంజయ్ రెడ్డి పేర్ని నానికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది
    అయితే ఈ ఘటనతో పేర్ని నాని పని అయిపోందన్న టాక్ కృష్ణా జిల్లాలో వినిపిస్తోంది. ఇటీవల పేర్ని నాని తరచూ పార్టీలో ఉండటం.. ఉండకపోవడం గురించి మాట్లాడుతున్నారు. తాను కొడుకునైనా వదులుకుంటాను కానీ జగన్ ను మాత్రం వదలనని చెప్పుకొస్తున్నారు. తనకు తానే రిటైర్మెంట్ ప్రకటించుకున్నారు. తను పనిచేసిన ముఖ్యమంత్రుల పేర్లు బయటపెట్టి జగన్ కంటే సీనియర్ నని అర్ధం వచ్చేలా మాట్లాడారు. ఏక సంబోధం చేస్తూ అనుచితంగా ప్రవర్తించారు. అయితే ఇదంతా సీఎం జగన్ తనకు చనువు అని చెప్పేందుకేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
    2004 నుంచి పేర్ని నాని రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే సుదీర్ఘ కాలం పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రభుత్వ విప్ గా సైతం పని చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించేవారు. కానీ వైసీపీకి వచ్చిన తరువాత తన స్వరూపాన్ని మార్చుకున్నారు. అధినేతకు నచ్చే విధంగా ఆహార్యం, మాటతీరు అలవాటు చేసుకున్నారు. . దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. వైసీపీలో ఆయనకు కానీ..ఆయన కుమారుడికి కానీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం బందరు సాక్షిగా  ఊపందుకుంది. ఇప్పుడు జగన్ ను గౌరవించకుండా ఏకవచనంతో సంబోధించడంతో మొదటికే మోసం వచ్చేసిందని చెబుతున్నారు. చూడాలి మరీ జగన్ తన మార్కు స్టైల్ లో పేర్ని నాని పక్కన పెడతారో లేదో..