https://oktelugu.com/

Priyanka Chopra: ఆ డైరెక్టర్ నా అండర్ వేర్ చూడాలన్నాడు… ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్

ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా కెరీర్ బిగినింగ్ లో ఎదురైన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తెలియజేశారు. ఓ మూవీలో నేను అండర్ కవర్ ఏజెంట్ రోల్ చేశాను.

Written By:
  • Shiva
  • , Updated On : May 24, 2023 / 01:52 PM IST

    Priyanka Chopra

    Follow us on

    Priyanka Chopra: హాలీవుడ్ లో సెటిల్ అయిన ప్రియాంక చోప్రా బాలీవుడ్ పై వరుస ఆరోపణలు చేస్తుంది. తాజాగా ఓ దర్శకుడు తన లోదుస్తులు చూడాలన్నాడని సంచలనానికి తెరలేపారు. ప్రియాంక చోప్రా లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయ్యారు. ఇంగ్లీష్ చిత్రాలు, సిరీస్లలో నటిస్తున్నారు. ఆమె లేటెస్ట్ యాక్షన్ సిరీస్ సిటాడెల్ అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 28 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రియాంక యాక్షన్ సన్నివేశాలతో పాటు బోల్డ్ సీన్స్ లో రచ్చ చేశారు.

    ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా కెరీర్ బిగినింగ్ లో ఎదురైన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తెలియజేశారు. ఓ మూవీలో నేను అండర్ కవర్ ఏజెంట్ రోల్ చేశాను. కథలో భాగంగా ఓ వ్యక్తిని నేను రెచ్చగొట్టాల్సి ఉంది. ఆ వ్యక్తితో ఇంటిమసీ సన్నివేశంలో నేను ఒక్కో వస్త్రం తొలగించాలి. దర్శకుడు నా అండర్ వేర్ కనిపించాలి అన్నాడు. అలా చేయకపోతే మన సినిమా ఎవరూ చూడరు అన్నాడు. అది ఒక అమానవీయమైన ఘటన… అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు.

    ఆ సందర్భం నన్నెంతో ఇబ్బంది పెట్టిందని ప్రియాంక చోప్రా వెల్లడించారు. ప్రియాంక చోప్రా చెప్పిన వివరాల ప్రకారం ఆ దర్శకుడు ఎవరని చిత్ర వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ప్రియాంక బాలీవుడ్ కి దూరం కావడానికి ఇక్కడ రాజకీయాలే కారణమని గతంలో చెప్పారు. కొందరు ఉద్దేశపూర్వకంగా నాకు ఆఫర్స్ రాకుండా చేశారు. ఈ క్రమంలో గొడవలు జరిగాయి. బాలీవుడ్ లో ఉన్న అనారోగ్యకర వాతావరణం నచ్చకే పరిశ్రమకు దూరంగా వెళ్లిపోయానని ప్రియాంక చోప్రా అన్నారు.

    ప్రియాంక చోప్రా 2018లో నిక్ జోనాస్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. నిక్ అమెరికన్ సింగర్ అండ్ యాక్టర్. ప్రియాంక సరోగసి పద్దతిలో ఒక పాపకు జన్మనిచ్చింది. పెళ్ళికి ముందు తనతో పని చేసిన పలువురితో డేటింగ్ చేశానని ప్రియాంక ఓపెన్ గా చెప్పారు. నిక్ జోనాస్ తో బంధం మొదలు కావడానికి ముందు చాలా గ్యాప్ వచ్చింది. నా సోల్ మేట్ నిక్ జోనాస్ అని నాకు అర్థమైంది. అందుకే వివాహం చేసుకున్నానని ప్రియాంక చోప్రా అన్నారు.