Perni Nani: సోషల్ మీడియా( social media) పుణ్యమా అని తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేయిస్తున్నారు. దాని పర్యవసానాలు సామాన్యులు అనుభవిస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే మచిలీపట్నంలో వెలుగు చూసింది. నాలుగు రోజుల కిందట ఓ యూట్యూబ్ ఛానల్ లో ఓ ఆర్ఎంపీ డాక్టర్ మాట్లాడారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. తిట్ల దండకం అందుకున్నారు. అయితే ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జన సైనికులు ఒక్కసారిగా ఆయన ఇంటి ముందు నిరసనకు దిగారు. ఆయనపై దాడి చేసి క్షమాపణలు చెప్పించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
* ఆర్ఎంపి పై దాడి.. మచిలీపట్నంలోని( Machilipatnam) సత్రంపేట ప్రాంతానికి చెందిన గిరిధర్ అనే ఆర్ఎంపి నాలుగు రోజుల కిందట ఓ యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడాడు. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం పై విమర్శలు చేశాడు. అసలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బాధ్యతగా వ్యవహరించడం లేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొన్ని రకాల బూతు పదాలను కూడా వాడారు. అయితే సదరు యూట్యూబ్ ఛానల్ ఎంత మాత్రం సెన్సార్ చేయకుండా యధావిధిగా ఆ వీడియోలను ప్రసారం చేసింది. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన జనసైనికులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఒక వందమంది గిరిధర్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొందరు ఆయనపై దాడి చేసి పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు ఇప్పించారు. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
* పేర్ని నాని సీరియస్
మరోవైపు ఈ ఘటనపై మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని( perni Nani ) స్పందించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో జన సైనికులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. తనతో పాటు తన కుమారుడిని వెంటాడుతున్నారని.. జగన్మోహన్ రెడ్డి పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో పోలీసులు కలుగ చేసుకోవాలని.. లేకుంటే మున్ముందు జనసైనికులు రెచ్చిపోతారని చెబుతున్నారు. పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే కొంతమంది యూట్యూబ్, సోషల్ మీడియా నిర్వాహకుల పుణ్యమా అని ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటువంటి వారిని నియంత్రించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
మచిలీపట్నంలో దారుణం!
ఓ యూట్యూబ్ ఛానెల్ లో పవన్ కళ్యాణ్ ను దూషించాడని.. RMP డాక్టర్ గిరిధర్ మీద దాడి చేసిన జనసేన నాయకులు
సుమారు 100 మంది ఆయన ఇంటి మీద దాడి చేసి పూర్తిగా ఇంటిని ధ్వంసం చేశారు
మోకాలు మీద కూర్చోబెట్టి బలవంతంగా డిప్యూటీ సీఎం కు క్షమాపణలు చెప్పించారు pic.twitter.com/zOhkJuE3WE
— greatandhra (@greatandhranews) September 12, 2025