Prakash Raj Vs Pawan Kalyan: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కు జనసేన కౌంటర్ ఇచ్చింది. అమ్ముడుపోవడం అంటే ఇది అంటూ గతంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడిన ఓ వీడియోని పోస్ట్ చేసింది. మాతృభాషను కాపాడుకుంటూ ఇతర భాషలను నేర్చుకోవడం, గౌరవించడం అమ్ముడుపోవడం కాదు. అసలు ఇతర భాషలను నేర్చుకోడమే తప్పంటే నువ్వు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చేయగలవా ఈ రోజు ఇలా మాట్లాడగలవా అని జనసేన ప్రశ్నించింది. పవన్ కళ్యాణ్ హిందీ స్టాండ్ పై ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు. పవన్ మాట్లాడిన వీడియో ను షేర్ చేస్తూ ఛీ.. ఛీ.. అంటూ రాసుకొచ్చారు. దీనిపై జనసేనతో పాటు బీజేపీ కేడర్, పవన్ అభిమానులు మండిపడుతున్నారు.