Jaganannku Chebudam : జగన్ సర్కారు ప్రచార ఆర్భాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఐదేళ్లలో వందల కోట్లు ప్రచారానికే ఖర్చుచేసింది. అందులో సింహభాగం సొంత మీడియా సాక్షికే కేటాయించారు. చివరకు వారం వారం ఇసుక ధరలు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. చేసింది పావలా పని అయితే ప్రచారానికి రూపాయి ఖర్చుపెట్టే ఆర్భాటం జగన్ సొంతం. కానీ ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన జగనన్నకు చెబుతాం అనే ప్రోగ్రాం గురించి ఎక్కువగా ప్రచారం కల్పించడం లేదు. దానిని ఒక ఫెయిల్యూర్ స్కీం కింద చూడడమే కారణమన్న టాక్ వినిపిస్తోంది.
గత నాలుగేళ్లుగా అదిగో ఇదిగో అంటూ వస్తున్న కాల్ సెంటర్ ప్రోగ్రాంను నెల రోజుల కిందట ప్రారంభించారు. అయితే ఇది సక్సెస్ అయ్యిందంటూ ప్రచారం చేసుకోకపోవడమే కాస్తా విస్తుగొల్పుతోంది. ఐ ప్యాక్ టీమ్ నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు కాల్ చేయగానే జగనన్న పరిష్కరించాలంటూ ఓ సమస్యను ఈ టీమ్ వైరల్ చేస్తుంది. ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుందని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అలాంటిదేమీ జరగడం లేదు. కాల్ సెంటర్ కు వస్తున్న కాల్స్ గురించి ఎవరూ మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
గత ప్రభుత్వంలో గ్రీవెన్స్ సెల్ రూపంలో ఉన్న ఫిర్యాదుల విభాగాన్ని స్పందనగా మార్చారు. అయితే ‘స్పందన’కే స్పందన లేదని ప్రజలు అసంతృప్తికి గురయ్యారు. వినతులు ఇవ్వడమే కానీ పరిష్కార మార్గం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోనీ సీఎంను కలుద్దామంటే ఆయన ప్యాలెస్ లో మాత్రమే ఉండిపోతున్నారు. .. సమస్యలపై ఎవరికి చెప్పుకోవాలో తెలియని దీన స్థితికి జనం వెళ్లిపోయారు. ఈ అసంతృప్తిని గమనించి జగనన్నకు చెబుతాం అనే కార్యక్రమం పెట్టారు. కానీ ఇది వర్కవుట్ అయ్యేలా లేదు. తొలిరోజే ఇదొక ఫెయిల్యూర్ ప్రోగ్రాంగా తేలిపోయింది.
జగనన్నకు చెబుతాం అంటే.. జనాలు ముందుకు రాని దుస్థితి. ఒక వేళ కాల్ సెంటర్ కు ఫిర్యాదుచేస్తే ఎటువంటి రిప్లయ్ వస్తుందోనన్న అనుమానం ప్రజల్లో బలంగా ఉంది. అనవసరంగా లేనిపోని సమస్యలెందుకని సాహసించడం లేదని చెబుతున్నారు. అదే సమయంలో తాము ఫిర్యాదు చేశామని తెలిస్తే.. రకరకాలుగా వేధింపులకు గురి చేస్తారని.. ఇప్పుడు అలాంటివి అవసరమా అనుకునే పరిస్థితుల్లో ఉన్నారు. పోలీసులు బాధితుల వైపు ఉండటం లేదు.. నిందితులవైపే ఉంటున్నారు. అది వైసీపీ వారు నిందితులయితే రక్షణ కూడా కల్పిస్తున్నారు.మరో వైపు వస్తున్న కాల్స్ గురించి కూడా ప్రభుత్వం బయట పెట్టడం లేదు. ఇలా వస్తున్న కాల్స్ లో అత్యధిక ఫిర్యాదులు ప్రభుత్వంపైనే ఉంటున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.