Pensions New Rules: ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని భావిస్తోంది. వీలైనంత త్వరగా సూపర్ సిక్స్ పథకాలను ప్రారంభించి.. ప్రతిపక్షాల విమర్శలకు చెక్ చెప్పాలని భావిస్తోంది. ఇప్పటికే తల్లికి వందనం పథకం అమలు చేసింది. అన్నదాత సుఖీభవకు కసరత్తు పూర్తి చేసింది. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని వేయి రూపాయలకు పెంచి అందిస్తోంది. మరోవైపు కొత్త పింఛన్ల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. అందుకే ఇప్పుడు బోగస్ పింఛన్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అనర్హుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంకోవైపు దివ్యాంగుల కోటా పింఛన్లపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వాటిని తొలగించి కొత్త పింఛన్లు ఇవ్వాలని ప్రణాళిక వేస్తోంది.
Also Read: ఇక జగన్ నే దిక్కు.. వల్లభనేని వంశీ డిసైడ్ అయ్యాడా?
వైకల్య నిర్ధారణ పరీక్షలు
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) హయాంలో లక్షలాదిమంది అనర్హులు పింఛన్లు పొందారు అన్నది ప్రధాన ఆరోపణ. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బోగస్ పింఛన్లు గుర్తించేందుకు వైద్యుల బృందాలను నియమించింది. వారు ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి దివ్యాంగుల ను తనిఖీ చేశారు. వారికి వైకల్య నిర్ధారణ పరీక్షలు జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో నాలుగు లక్షల దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులకు తనిఖీలు పూర్తి చేశారు. అందులో లక్షకు పైగా అనర్హులు ఉన్నట్లు తేలింది. రికార్డ్ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో బోగస్ పింఛనుదారులు ఉన్నట్లు తేలినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హయాంలో ప్రముఖుల నియోజకవర్గాల్లోనే ఎక్కువగా అనర్హులు పింఛన్లు దక్కించుకున్నట్లు తాజా తనిఖీల్లో తేలింది.
ప్రధానంగా ఈ విభాగాల్లో..
ప్రధానంగా అంధత్వం, చెవుడు, శారీరక వికలాంగత వంటి లక్షణాలు లేనప్పటికీ.. తప్పుడు ధ్రువీకరణ( fake certificate ) పత్రాలతో పింఛన్లు పొందిన వారి సంఖ్య.. 50 వేల మందికి పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కంటి చూపు ఉన్నా కూడా దివ్యాంగులుగా తప్పుడు పత్రాల ద్వారా పింఛన్లు పొందిన వారు 23 వేల మంది ఉన్నట్లు తేలింది. వినికిడి లోపం లేనప్పటికీ 20 వేల మంది పింఛన్లు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది దివ్యాంగులకు నోటీసులు జారీ చేశారు. వీరిలో ఇప్పటివరకు 4.76 లక్షల మంది రీ వెరిఫికేషన్ కు హాజరయ్యారు. మిగిలిన వారు హాజరు కాకపోవడంతో వారి పింఛన్లు నిలిపివేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ తనిఖీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
Also Read: షాకింగ్ నిరసన.. బాబుకు ‘యోగా’ ట్రీట్ మెంట్
పులివెందులలో అధికం..
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పులివెందులలో( pulivendula ) ఎక్కువగా బోగస్ పింఛన్లు ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. కాకినాడ సిటీ నియోజకవర్గంలో సైతం బోగస్ అధికంగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. 88 నియోజకవర్గాల్లో వెయ్యి మందికి పైగా బోగస్ దివ్యాంగ పింఛన్లు, 59 నియోజకవర్గాల్లో 500కు పైగా.. 13 నియోజకవర్గాల్లో వెయ్యి నుంచి 1300 మంది మధ్య బోగస్ పింఛన్లు ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో తేలడం విశేషం. వైసిపి హయాంలో టిడిపి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం ఉన్నచోట మాత్రం బోగస్ తక్కువగానే నమోదయినట్లు తెలుస్తోంది.