Jagan Vamsi Meeting: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. సుమారు 135 రోజుల అనంతరం ఆయనకు జైలు నుంచి విముక్తి లభించింది. ఆయనపై నమోదైన 11 కేసులకు సంబంధించి.. బెయిల్ లభించింది. దీంతో నిన్ననే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. జైలు బయట మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం ఆత్మీయంగా స్వాగతం పలికారు. భారీ కాన్వాయ్ నడుమ విజయవాడలోని నివాసానికి చేరుకున్నారు వల్లభనేని వంశీ మోహన్. మరోవైపు ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు వంశీ. ఆయన వెంట భార్య పంకజశ్రీ కూడా ఉన్నారు. ఈరోజు తాడేపల్లి లోని జగన్ నివాసానికి వచ్చి కలిశారు. ఈ సందర్భంగా జైలు జీవితం, తాజా పరిణామాలపై ఆయనతో మాట్లాడారు.
Also Read: విజయసాయి రెడ్డి రీ ఎంట్రీ.. రంగంలోకి కీలక నేత!
వైసీపీలోకి ఫిరాయింపు..
2019 ఎన్నికల్లో టిడిపి( Telugu Desam Party) నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ మోహన్ అనూహ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అలా వెళ్లిన నాటి నుంచి చంద్రబాబుతో పాటు లోకేష్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. నిత్యం అనుచిత వ్యాఖ్యలతో రాజకీయ సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కొద్ది రోజులపాటు గ్యాప్ వచ్చింది. నియోజకవర్గానికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో వల్లభనేని వంశీ మోహన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై వరుసగా కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఫిబ్రవరి 17న వల్లభనేని వంశీ మోహన్ ను అరెస్టు చేశారు. ఆయన అరెస్టు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేరుగా జైలుకు వెళ్లి పరామర్శించారు. ఇప్పుడు విడుదల కావడంతో అధినేత జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
Vallabhaneni Vamsi With Ys Jagan!!❤️
He Will Be Active In Gannavaram Politics Very Soon!!@ysjagan @DrVVamsi ❤️ pic.twitter.com/YsK4lFV1v9
— sai chowdary (@saiholicc) July 3, 2025
జైలులో అనారోగ్యం
వరుసగా కేసులు నమోదు కావడం. దాదాపు 5 నెలల పాటు జైలు జీవితం గడపడంతో మధ్యలో అనారోగ్యానికి గురయ్యారు వల్లభనేని వంశీ మోహన్( Vamsi Mohan). కోర్టులకు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న ప్రతిసారి ఆయనపై.. మరో రకమైన కేసులు నమోదు చేసేవారు. అయితే చివరకు అన్ని కేసుల్లోనూ బెయిల్ రావడంతో నిన్ననే విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు వంశీ. దీంతో అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కష్టకాలంలో అండగా నిలిచినందుకు వంశీ దంపతులు ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీలో క్రియాశీలకంగా కావాలని జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా వల్లభనేని వంశీ మోహన్ కు సూచించినట్లు సమాచారం.
The couple of former Gannavaram MLA @VVMfanclub met YSRCP president @ysjagan YS Jagan mohan Reddy in Tadepalli Vamsi, who was released on bail yesterday after being in illegal detention for 140 days pic.twitter.com/96AC8l1NSn
— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) July 3, 2025