Pendem Dorababu : ఏపీలో( Andhra Pradesh) పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఎన్నికలు జరిగి 10 నెలలు గడుస్తోంది. ఇప్పట్లో ఎన్నికలు కనిపించడం లేదు. కానీ రాజకీయంగా వేడి మాత్రం తగ్గడం లేదు. గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే 40 శాతం ఓట్లు దక్కించుకొని నిలబడింది. ఇప్పటికీ బలంగానే కనిపిస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని కూటమి భావిస్తోంది. అందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. కీలక నేతల సైతం అదే పనిలో ఉన్నారు.
* ఒక్కో నేత రాజీనామా బాట
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) సభ్యత్వంతో పాటు రాజ్యసభ, ఎమ్మెల్సీ వంటి పదవులను సైతం నేతలు వదులుకోవడం నిజంగా ఆశ్చర్యకరమే. పార్టీలో కీలక నేతగా ఎదిగిన విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ పదవిని వదులుకున్నారు. పార్టీ పదవులను వదులుకున్నారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఆయనతో పాటు మరో నలుగురు రాజ్యసభ సభ్యులు సైతం రాజీనామాలు చేశారు. ఓ ఆరుగురు వరకు ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పారు. తాజా మాజీ మంత్రులతో పాటు మాజీ ఎమ్మెల్యేల విషయం చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఎవరు పార్టీలో ఉంటారో.. ఉండరు తెలియని పరిస్థితి. తాజాగా చాలామంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Also Read : సూపర్ విక్టరీ.. ఎమ్మెల్యేగా ఛాన్స్ మిస్..ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా!
* ముహూర్తం ఫిక్స్
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు( pendum dorababu ) జనసేనలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దొరబాబును పక్కకు తప్పించారు. ఆయన స్థానంలో వంగా గీతను నియమించారు. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కు సూచించారు. అయితే ఎన్నికల్లో ఆయన ఆశించిన స్థాయిలో పనిచేయలేదని ప్రచారం నడిచింది. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా పార్టీకి దూరంగా ఉన్న దొరబాబు రాజీనామా కూడా ప్రకటించారు. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి గెలిచారు దొరబాబు.
* ప్లీనరీకి చురుగ్గా ఏర్పాట్లు..
జనసేన ప్లీనరీ ( janasena pleenary) ఈ నెల 14న జరగనున్న సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దొరబాబు ప్లీనరీ వేదికగా జనసేనలో చేరుతారని తెలుస్తోంది. అయితే పెండెం దొరబాబు తో పాటు చాలామంది మాజీలు జనసేన గూటికి చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పిఠాపురంలో జనసేన ప్లీనరీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.
Also Read : *వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుతో మారిన సీన్.. అక్కడ ఓటమికి అదే కారణం!*