Peddireddy Ramachandra Reddy : సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైలెంట్ అయ్యారు. ఆయన పెద్దగా కనిపించడం లేదు. మీడియాలో సైతం ఆయన పేరు వినిపించడం లేదు. అయితే ఆయన సైలెన్స్ వెనుక పెద్ద స్కెచ్ ఉందని టిడిపి ఆరోపిస్తోంది. ఆయన విదేశాలకు వెళ్లిపోతారని ప్రచారం చేస్తోంది. దానికి తగినట్టు ఆధారాలతో వివరాలను వెల్లడించింది. ఆఫ్రికాలో కాంట్రాక్టుల పేరిట ఇక్కడ నుంచి వాహనాల తరలింపు ప్రక్రియను బయటపెట్టింది. ముంబై పోర్టు నుంచి వాహనాల తరలింపునకు సంబంధించి వార్త ఒకటి బయటకు వచ్చింది. దీంతో పెద్దిరెడ్డి చడీ చప్పుడు కాకుండా వ్యాపారాల పేరిట విదేశాలకు వెళ్లిపోవడం ఖాయంగా తేలుతోంది.
గత ఐదు సంవత్సరాలుగా పెద్దిరెడ్డి హవా నడిచింది. తన కను సన్నల్లో రాయలసీమ రాజకీయాలను శాసించారు పెద్దిరెడ్డి. అందుకే జగన్ సైతం భయపడ్డారు. మంత్రివర్గ విస్తరణలో సైతం కంటిన్యూ అయ్యారు. చంద్రబాబుతో పాటు టిడిపి నేతలను వేధించడంలో పెద్దిరెడ్డి ముందుండేవారు. చిత్తూరు జిల్లా అంగళ్లు అయితే చంద్రబాబుపై హత్య ప్రయత్నం చేసినంత పని చేశారు వైసిపి అల్లరి మూకలు. వారి వెనుక పెద్దిరెడ్డి ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. పైగా కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానని శపధం చేశారు. హిందూపురం నుంచి బాలకృష్ణను వెళ్లగొడతానని కూడా వచ్చారు. రాయలసీమలో ప్రతి అవినీతి వెనుక పెద్దిరెడ్డి ఉన్నారన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఎన్నికల వస్తే టార్గెట్ అయ్యేది ఆయనే. అందుకే పోలింగ్కు ముందు.. తరువాత పెద్దిరెడ్డి తో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి సైలెంట్ అయ్యారు.
సాధారణంగా ఏదైనా పరిశ్రమలను ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉండే యంత్రాలు,వాహనాలను వినియోగిస్తారు. కానీ పెద్దిరెడ్డి మాత్రం ఆఫ్రికాలో మైనింగ్ కోసం ఏపీ నుంచి వాహనాలను తరలిస్తుండడం విశేషం. అయితే ఇలా వాహనాల తరలింపు తో పనిమీద విదేశాలకు వెళుతున్నట్లు చెప్పే ప్రయత్నం గా తెలుస్తోంది. కానీ అది ముందస్తు ప్లాన్ గానే చేసినట్లు.. ఓటమి భయంతోనే విదేశాలకు వెళ్తున్నట్లు టిడిపి ప్రచారం చేయడం ప్రారంభించింది. ఇప్పటికే వల్లభనేని వంశీ మోహన్ అమెరికాలో ల్యాండ్ అయ్యారు. ఆయన ఆరు నెలల వరకు వచ్చే పరిస్థితి లేదని సన్నిహితులు చెబుతున్నారు. అటు కొడాలి నాని సైలెంట్ అయ్యారు. వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, పేర్ని నాని నిట్టూర్పు మాటలకు పరిమితమయ్యారు. కానీ పెద్దిరెడ్డి అలా వ్యవహరించడానికి సాధ్యం కాదు. ఎందుకంటే వైసీపీలో ఆయన పెద్దమనిషి. అందుకే విదేశాలకు గౌరవంగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.