Warangal Airport: వరంగల్‌కు త్వరలో విమానాలు రానున్నాయా అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణ విషయంలో కదలిక వస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగియగానే ఈ అంశంపై సీఎం సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈమేరకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కూడా సీఎం చర్చలు జరుపుతారని తెలసింది.
ఎప్పటి నుంచో ప్రయత్నాలు..
వరంగల్‌లో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్నేల్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరుఉతున్నాయి. అయితే కొలిక్కి రాలేదు. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారినందున వరంగల్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ ఇటీవలే ప్రకటించారు. దీంతో ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారుల్లో కదలిక వచ్చింది.
706 ఎకరాలు సిద్ధం..
వరంగల్‌లో విమానాశ్రయ నిర్మాణానికి వీలుగా ప్రస్తుతం 706 ఎకరాలు సిద్ధంగా ఉంది. మరో 253 ఎకరాలు కేటాయిస్తూ ఎన్నికల కోడ్‌కు ముందే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. హైదరాబాద్‌కు చెందిన జీఎంఆర్ ఎయిర్‌పోర్టుతోపాటు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. భూమి కేటాయించిన నేపథ్యంలో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అదికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు.
మొదట చిన్న విమానాలు..
ఎయిర్ పోర్టును మొదట చిన్న విమానాలకు అనుకూలంగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. తర్వాత క్రమంగా విస్తరించాలనే యోచనలో ఉంది. దీనికి అనుగుణంగానే భూములు కేటాయిచింది. విమానాశ్రయ నిర్మాణానికి 400 ఎకరాలు అవసరమని ఏఏఐ తన నివేదికతో తెలిపింది. విస్తరణకు రూ.1,200 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగియగానే వరంగల్ ఎయిర్ పోర్టు నిర్మాణ అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.