YS Sharmila : షర్మిల ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాను అనుకున్నది అనుకున్న విధంగా చెబుతున్నారు. వైసీపీని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారు. రోజుకో లేఖతో కాక రేపు తున్నారు. గత కొద్దిరోజులుగా వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల వివాదం రచ్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. జగన్ వర్సెస్ షర్మిల అన్నట్టు పరిస్థితి మారింది. అదే సమయంలో వైసీపీ నేతలు దూకుడుతో ముందుకు సాగుతున్నారు. షర్మిలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఎంట్రీ ఇచ్చారు విజయమ్మ. ఏకంగా అభిమానులకు భారీ లేఖ ఒకటి విడుదల చేశారు. తన కుమార్తె షర్మిలకు మద్దతుగా నిలిచారు. ఆమెకు ఎటువంటి ఆస్తులు ఇవ్వలేదని తేల్చి చెప్పారు. తన భర్త రాజశేఖర్ రెడ్డి ఆస్తుల పంపకాలు చేపట్టాలని భావించారని గుర్తు చేశారు. కానీ ఇంతలోనే మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.కుటుంబంలో జరుగుతున్న ఆస్తుల వివాదం వెనుక వాస్తవం ఇది అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇన్ని రోజులు షర్మిలను టార్గెట్ చేసుకున్న వైసీపీ శ్రేణులు.. ఇప్పుడు విజయమ్మను సైతం అదే కోణంలో చూడడం ప్రారంభించాయి. కుమారుడు జగన్ బెయిల్ రద్దు విషయంలో విజయమ్మ పావు అవుతున్నారని ఆరోపణలు చేశారు.
* షర్మిల ఘాటు రిప్లయ్
తాజాగా ఈ ఘటనపై స్పందించారు పిసిసి అధ్యక్షురాలు షర్మిల జగన్ బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ గా అభివర్ణించారు. ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదని.. 32 కోట్లు విలువచేసే కంపెనీ స్థిరాస్తిని మాత్రమేనని గుర్తు చేశారు. షేర్ల బదలాయింపు పై ఎటువంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవన్నారు. స్టేటస్ కో ఉన్నది షేర్స్ మీద కాదని.. గతంలో కూడా ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడి అటాచ్ చేసినప్పటికీ.. వాటి షేర్లు, స్టాక్ మార్కెట్లో ట్రెండింగ్, బదిలీలను మాత్రం ఆపలేదని గుర్తు చేశారు షర్మిల. 2016 లో ఈడి భూములను అటాచ్ చేసినందు వల్ల షేర్ల బదిలీ చేయకూడదని వింతగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
* ఆ ఒప్పందం తెలియదా?
అయితే గతంలో జరిగిన ఒప్పందాన్ని మరోసారి బయటపెట్టారు షర్మిల. 2019లో తనకు 100% వాటాలు బదలా ఇస్తామని స్పష్టంగా పేర్కొంటూ ఒప్పందంపై సంతకం చేశారని గుర్తు చేశారు. 2021లో క్లాసిక్ రియాలిటీ, సండూరు పవర్ కి చెందిన సరస్వతి షేర్లను 42 కోట్ల రూపాయలకు అమ్మ విజయమ్మకు ఎలా అమ్మారు? అప్పుడు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని నిలదీశారు. మొత్తానికైతే వైసీపీ నుంచి వస్తున్న ప్రతి ప్రశ్నకు షర్మిల బదులిస్తుండడం విశేషం. కానీ వైసీపీ నుంచి మాత్రం ఆ స్థాయిలో ప్రతిస్పందన రావడం లేదు. వారిచ్చే కౌంటర్లో పస ఉండడం లేదు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pcc president sharmila jagan termed conspiracy to cancel bail as biggest joke of the century
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com