Tirumala Laddu Controversy : తిరుమల లడ్డు వివాదం.. సుప్రీం కామెంట్స్ పై పవన్ సంచలన కామెంట్స్!

తిరుమలలో వివాదం సీరియల్ గా కొనసాగుతూనే ఉంది. నిన్న సుప్రీంకోర్టు స్పందించిన తీరుతో కొత్త మలుపు తిరిగింది. నిన్నటి వరకు వైసిపి కార్నర్ కాగా.. సుప్రీం తాజా కామెంట్స్ తో కూటమి ప్రభుత్వం ఇబ్బందుల్లో పడినట్లు కనిపించింది. దానిపై తాజాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్.

Written By: Dharma, Updated On : October 1, 2024 6:12 pm

Tirumala Laddu Controversy (1)

Follow us on

Tirumala Laddu Controversy : శ్రీవారి లడ్డు వివాదం యూటర్న్ తీసుకుంది. సుప్రీంకోర్టు స్పందించిన వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అన్నది ప్రధాన ఆరోపణ. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఇదంతా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ గా వైసీపీ నేతలు తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు చంద్రబాబు వ్యాఖ్యలను తప్పు పట్టడంతో.. వైసీపీ నేతలకు కొంత బలం దొరికింది.అందుకే ఇప్పుడు ఆ పార్టీ నేతలు రివర్స్ అవుతున్నారు. అయితే లడ్డు వివాదం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ గట్టిగానే స్పందించారు.సనాతన ధర్మ పరిరక్షణకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా అభిప్రాయపడ్డారు.అంతటితో ఆగకుండా ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టారు. విజయవాడ దుర్గమ్మ గుడిమెట్లను శుభ్రం చేసి నిరసన తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆయన చేపడుతున్న దీక్ష ముగియనుంది. అయితే చంద్రబాబు ఆరోపణలపై వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి,బిజెపి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రాథమిక విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం చంద్రబాబు వ్యాఖ్యలపై కొన్ని అభ్యంతర కామెంట్స్ చేసింది. సెకండ్ ఒపీనియన్ కు వెళ్లకుండా,ఆధారాలు లేకుండాఎలా మాట్లాడతారని చంద్రబాబును ప్రశ్నించింది. రాజకీయాలకు కనీసం దేవుళ్ళనైనా దూరంగా పెట్టాలంటూ హితబోధ చేసింది. ఈ నెల మూడుకు విచారణను వాయిదా వేసింది.

* నిలిచిన సిట్ విచారణ
మరోవైపు ఈ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు నిలిచిపోయింది. ఈ విషయాన్ని డీజీపీ ద్వారకా తిరుమల వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించారు పవన్ కళ్యాణ్. విజయవాడలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు.తిరుమల లడ్డు కల్తీ గురించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. లడ్డు తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎక్కడా చెప్పలేని విషయాన్ని పవన్ గుర్తు చేశారు.విచారణ సమయంలో తమకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే న్యాయమూర్తులు అలా చెప్పి ఉంటారని అనుకుంటున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు.

* ఆ తేదీలపై గందరగోళం
నెయ్యి కల్తీపై అందిన లేబరేటరీ నివేదికల్లో పొందుపరిచిన తేదీలపై కొంత గందరగోళం ఉందని న్యాయమూర్తులు చెప్పారని పవన్ పేర్కొన్నారు. వాటిపై స్పష్టత ఇస్తామని చెప్పారు. ఒక్క లడ్డు ప్రసాదం విషయంలోనే కాకుండా గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో విధ్వంసాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రాయశ్చిత్త దీక్ష అనేది ఒక్క లడ్డు వివాదం కోసం కాదన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.గత ఐదేళ్ల జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై విధ్వంసాలు జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం వచ్చింది చిన్నపాటి వివాదమేనని.. గత ఐదేళ్ల జగన్ పాలనలో చాలా రకాలవైఫల్యాలు జరిగాయని.. వాటన్నింటినీ బయటకు తీస్తామని కూడా పవన్ హెచ్చరించారు. మొత్తానికి అయితే పవన్ తాజా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.