Chandrababu: చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సంకేతం?

ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించారు.జనసేన అక్కడ పోటీ చేయబోయే నియోజకవర్గాలపై క్లారిటీ ఇస్తున్నారు.అదే సమయంలో టిడిపి నేతలతో సైతం సమావేశం అవుతున్నారు.ఈ నేపథ్యంలోనే రాజమండ్రి రూరల్ సీటు నుంచి కందుల దుర్గేష్ పేరును ఖరారు చేశారు.

Written By: Dharma, Updated On : February 22, 2024 5:45 pm
Follow us on

Chandrababu: జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. త్వరలో బిజెపి రానుంది. ఈ మూడు పార్టీలు కూటమి కట్టనున్నాయి. దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు కూటమి విషయంలో పవన్ పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాల పర్యటన చేస్తున్నారు. త్వరలో ఢిల్లీ వెళ్ళనున్నారు. బిజెపి అగ్రనేతలతో సమావేశం కానున్నారు. అయితే తాజాగా పవన్ ఇచ్చిన పిలుపు వైరల్ అవుతోంది. వయసు మళ్లిన నేతలు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ కావాలని పవన్ పిలుపు ఇవ్వడం విశేషం. అయితే ఈ పిలుపు చంద్రబాబుకా ? టిడిపి సీనియర్లకా? అన్నది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించారు.జనసేన అక్కడ పోటీ చేయబోయే నియోజకవర్గాలపై క్లారిటీ ఇస్తున్నారు.అదే సమయంలో టిడిపి నేతలతో సైతం సమావేశం అవుతున్నారు.ఈ నేపథ్యంలోనే రాజమండ్రి రూరల్ సీటు నుంచి కందుల దుర్గేష్ పేరును ఖరారు చేశారు. అక్కడ సుదీర్ఘకాలం టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఆయన టిడిపి వ్యవస్థాపక సభ్యుడు కూడా. గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి రూరల్ కు మారారు. ఆరుసార్లు గెలుపొందారు. అటువంటి నాయకుడు స్థానంలో కందుల దుర్గేష్ నుపవన్ ఎంపిక చేయడం విశేషం.అయితే ఈ సీటు తనకు చంద్రబాబు ప్రకటించారని.. అసలు కందుల దుర్గేష్ ఎవరని బుచ్చయ్య చౌదరి ప్రశ్నిస్తుండటం సంచలనం రేకెత్తిస్తోంది.

రాజకీయాల్లో 80 నుంచి 90 సంవత్సరాలు ఉన్న నేతలు గౌరవంగా తప్పించుకోవాలని పవన్ సూచించారు. భీమవరం సభలో పవన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే బుచ్చయ్య చౌదరిని ఉద్దేశించినవేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి అదే నిజమైతే 75 సంవత్సరాల వయసున్న చంద్రబాబు కోసం ఎందుకు పరితపిస్తున్నారని విపక్షాలు పవన్ ను ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర ప్రజల కోసం పొత్తు అనివార్యమని.. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తాను పొత్తు పెట్టుకున్నానని.. జాతీయ నాయకుల వద్ద చివాట్లు కూడా తిన్నానని పవన్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే వయసు పై మాట్లాడిన పవన్ పై విమర్శలు వ్యక్తం చేస్తూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అదే నిజమైతే యంగ్ స్టార్ అయిన జగన్ ను అధికారం నుంచి దూరం చేసేందుకు ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.అయితే పవన్ మాటల్లో వేరే అర్థం ఉందని.. అది చంద్రబాబు సంకేతాలు పంపించేందుకేనని.. టిడిపి సీనియర్లు సైతం త్యాగాలు సిద్ధం చేయాల్సిందేనని పవన్ తేల్చి చెప్పినట్లు విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అయితే పవన్ కామెంట్స్ టిడిపి సీనియర్లలో చికాకు పెడుతున్నాయి.ఇవి ఎంతవరకు తీసుకెళ్తాయో చూడాలి.