Pawan Kalyan Yoga With Modi: ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా రేపు వైజాగ్ లో జరగబోతున్న యోగా డే కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిపేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది తరళి రాబోతున్నారని అంచనా వేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ముఖ్య అతిథిగా పాల్గొనబోయే ఈ కార్యక్రమం లో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కూడా ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నాడు. గత పది రోజులుగా పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ లో ఫుల్ బిజీ గా ఉన్న ఈ నేపథ్యం లో ఈ కార్యక్రమానికి హాజరు అవుతాడా లేదా అనే సందేహాలు ఉండేవి.ప్రధాని పాల్గొనబోయే సభకు ఉప ముఖ్యమంత్రి హాజరు కాకపోతే అసలు బాగుండదు అని అభిమానులు సైతం అభిప్రాయాపడ్డారు.
కానీ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్టు జనసేన సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం. వివరాల్లోకి వెళ్తే నేడు మధ్యాహ్నం రెండు గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి బయలుదేరి మూడు గంటలకు విశాఖ పట్నం లోని గ్రాండ్ బే హోటల్ కి చేరుకుంటాడట. రాత్రి 7 గంటల 45 నిమిషాలకు సీఎం చంద్రబాబు తో కలిసి విశాఖపట్నం విమానాశ్రయం కి వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతాడట. ఆ తర్వాత మళ్ళీ గ్రాండ్ బే హోటల్ కి తిరుగుముఖం పడుతాడట. రేపు ఉదయమ్ ఆరు గంటలకు హోటల్ నుండి వైజాగ్ RK బీచ్ కి వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో కలిసి యోగాసనాలు వేస్తాడట. మళ్ళీ 12 గంటలకు తిరిగి హైదరాబాద్ కి వెళ్ళిపోతాడట. ఈరోజు కూడా ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ లో పాల్గొని వైజాగ్ కి వస్తున్నాడు, రేపు కూడా షూటింగ్ లో పాల్గొంటాడట.
Also Read: Pawan Kalyan: నవంబర్ నెల నుండి పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమా మొదలు..డైరెక్టర్ ఎవరంటే!
ఈ నెలాఖరు వరకు హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ నాన్ స్టాప్ గా పాల్గొంటాడట. ఆ తర్వాత ఒక వారం రోజులు గ్యాప్ తీసుకొని అమరావతి లో కొత్త షెడ్యూల్ ప్రారంబిస్తారట. ఇలా సెప్టెంబర్ నెల వరకు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటూ బిజీ గా ఉంటాడట పవన్ కళ్యాణ్. మొదటి పది నెలలు వరుసగా తన సమయాన్ని మొత్తం పాలనకే కేటాయించాడు. మూడు సినిమాలు బ్యాలన్స్ ఉన్నాయి, వాటికి డేట్స్ కేటాయిస్తే అయిపోతాయి కదా, ఎన్నో నెలల నుండి నిర్మాతలు ఎదురు చూస్తున్నారు అని అభిమానులు సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి అడిగేవారు. ఏప్రిల్ నెలలో మొదలు పెడితే ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలను రీసెంట్ గానే పూర్తి చేసాడు. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంతు వచ్చింది.