50 ఏళ్ల వయసు. హుందాగా ఉండాల్సిన సమయం. కానీ విపరీత బుద్ధి కలిగింది. అక్రమ సంబంధం వైపు ఆమె మనసు ఆకర్షితమైంది. దీంతో అందరిలో చులకనైంది. భర్త కూడా వద్దని వారించినా వినలేదు. సరికదా ఇంకా ఎక్కువ చేసింది. దీంతో భర్త భరించలేకపోయాడు. ఇంత పెద్ద వయసులో మనవలు, మనవరాళ్లతో సరదాగా ఉండాల్సిన బామ్మ తప్పటడుగులు వేసింది. ఈ నేపథ్యంలో భర్త తట్టుకోలేకపోయి కడతేర్చాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. భార్య గొంతు కోసి చంపేశాడు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో పోలీసులకు పట్టుపడ్డాడు.

జమ్ముకాశ్మీర్ లోని శ్రీనగర్ లోని జకురా ప్రాంతంలోని గులాబ్ బాగ్ ఏరియాలోని గులిస్తాన్ కాలనీలో అబ్దుల్ రెహ్మాన్ దార్, సలీమా (50) దంపతులు నివాసం ఉంటున్నారు. 25 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న అబ్దుల్ రెహ్మాన్, సలీమా దంపతులు కొన్ని సంవత్సరాల పాటు సంతోషంగానే ఉన్నా తరువాత వారి మధ్య గొడవలు జరిగాయి. పిల్లలు వివాహం చేసుకుని ఎవరికి వారు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. 50 ఏళ్ల వయసులో తన భార్య సలీమా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
ఈ నేపథ్యంలో అబ్దుల్ రెహ్మాన్,, సలీమా మధ్య గొడవలు జరిగినా కుటుంబ సభ్యులు సర్దిచెబుతూ ఉండేవారు. పిల్లలు పెళ్లి చేసుకుని కాపురాలు చేస్తుంటే వేరే వ్యక్తితో ఎంజాయ్ చేస్తున్నావా? అంటూ సలీమాను భర్త మందలించాడు. కానీ ఆమెలో మార్పు రాలేదు. ఎంత చెప్పినా సలీమా పద్ధతి మార్చుకోలేదు. చెప్పి చెప్పి విసిగి వేసారిన భర్త ఆమెను కడతేర్చాలని భావించాడు.
చివరికి సలీమా గొంతు కోసి చంపాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ హజరత్ బుల్, స్థానిక పోలీసు అధికారులు షోకెట్ మహమ్మద్, పర్వేజ్ అహ్మద్ వేలిముద్రలు సేకరించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం మేరకు సలీమా భర్త అబ్దుల్ రెహ్మాన్ ను పోలీసులు పట్టుకున్నారు.