Homeఆంధ్రప్రదేశ్‌Pawankalyan : జగన్ ఏ తప్పు చేయలేదు.. కోర్టుల తీరు తప్పు.. పవన్ నోట సంచలన...

Pawankalyan : జగన్ ఏ తప్పు చేయలేదు.. కోర్టుల తీరు తప్పు.. పవన్ నోట సంచలన కామెంట్స్

తిరుమలలో వివాదం పై ఆది నుంచి డిప్యూటీ సీఎం పవన్ దూకుడుగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ చర్యలను తప్పుపట్టారు. అప్పటి టీటీడీ ట్రస్ట్ బోర్డులపై విరుచుకుపడ్డారు.ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు తిరుపతి లడ్డులో జంతు కొవ్వు కలిసిందని సంచలన ప్రకటన చేశారు. వైసిపి హయాంలోనే ఈ పాపం జరిగిందని ఆరోపించారు. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు పటిష్టమైన వ్యవస్థ కావాలని అభిప్రాయపడ్డారు. దీనిపై హిందూ సమాజం ఆలోచన చేయాలని కూడా కోరారు. అయితే ఎక్కువ మంది దీనిని ఆహ్వానించారు.చాలామంది అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.అయినా పవన్ పట్టించుకోలేదు. ఈ ఘటనను నిరసిస్తూ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 11 రోజులపాటు దీనిని కొనసాగించారు. అందులో భాగంగా విజయవాడలోని దుర్గమ్మ గుడిమెట్లను శుభ్రం చేసి తనదైన రీతిలో నిరసన తెలిపారు. దీక్షలో భాగంగా చివరి రోజు తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు.గురువారం తిరుపతిలో వారాహి సభను నిర్వహించారు. వారాహి డిక్లరేషన్ లోని ముఖ్యంశాలను వెల్లడించారు.ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం చేసిన దాంట్లో లడ్డు ప్రసాదం కలిపి చాలా చిన్న విషయం గా పేర్కొన్నారు. గుమ్మడికాయ దొంగ అంటే మీరు భుజాలు తడుముకున్నారంటూ వైసీపీ నేతలను విమర్శించారు.ఈ అంశంపై దర్యాప్తు చేయమంటే రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించడం సబబు కాదన్నారు.ఈ విషయంలో జగన్ ది తప్పు కాదన్నట్టు వ్యవహరించారు. ఇటీవల సుప్రీంకోర్టు సీఎం చంద్రబాబు వైఖరిని తప్పు పట్టిన సంగతి తెలిసిందే.ఈ తరుణంలో పవన్ వ్యాఖ్యలు వేరే అర్థం వచ్చేలా ఉన్నాయి. జగన్ ది తప్పు కాదు.. కోర్టులు స్పందిస్తున్న తీరు తప్పు అనేలా ఆయన మాటలు ధ్వనించాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాను వైసీపీ ప్రభుత్వ వైఖరి గురించి మాట్లాడలేదని.. కేవలం టిటిడి వైఫల్యాలపై మాత్రమే వ్యాఖ్యానించినట్లు చెప్పుకొచ్చారు పవన్. ప్రస్తుతం పవన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

* పవన్ భావోద్వేగం
కాగా ఈ సభలో పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు.కీలక వ్యాఖ్యలు చేశారు.’ ఏడుకొండలవారికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటాం. అన్ని ఓట్ల కోసమే చేస్తామా? ఓట్ల కోసమే మాట్లాడతామా? నా జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని ఊహించలేదు. నాకు అన్యాయం జరిగితే బయటకు రాలేదు. తిరుమలలో అపచారం జరుగుతోంది. సరిదిద్దండి అని గతంలో చెప్పా. అయినా పట్టించుకోలేదు. అందుకే 11 సీట్లకే పరిమితమయ్యారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. కలియుగంలో ధర్మానికి ప్రతిరూపం వెంకటేశ్వర స్వామి’ అంటూ కీలక ప్రసంగం చేశారు జగన్.

* జగన్ ను తప్పు పట్టలేదంటూనే
మరోవైపు పవన్ జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము జగన్ ను ఎప్పుడూ తప్పు పట్టలేదని చెప్పుకొచ్చారు. తిరుమల ప్రసాదాల్లో నిబంధనలు ఉల్లంఘన పైనే మా ఆవేదన. గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను మాత్రమే ప్రశ్నిస్తున్నాం. జగన్ హయాంలో ఉన్న టీటీడీ బోర్డు వైఖరి పైనే మా ఆరోపణలు అంటూ చెప్పుకొచ్చారు పవన్. వై వి సుబ్బారెడ్డి హయాంలో పదివేల రూపాయలు తీసుకుని 500 రూపాయల రసీదు ఇవ్వడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా తిట్టే రకం మీరు. దర్యాప్తు చేయాలని కోరితే రాజకీయాలు చేస్తున్నామంటున్నారు. మీరు చేసిన పాపాలు ఏమిటో ఆ స్వామివారి చెబుతారు. స్వామివారి నిజరూప దర్శనం అప్పుడు తెలుస్తుంది. పాత ఈవో ధర్మారెడ్డి ఏమయ్యారు? ఎందుకు మాట్లాడడం లేదు? ఆచారాలు పాటించిన వ్యక్తి టీటీడీ ఈవో గా ఎందుకు ఉన్నారు? జగన్ పై 29 పెండింగ్ కేసులు ఉన్నాయి. వాటిలో కొన్ని క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి అంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎన్నో అన్యాయాలు చేసిందని చెప్పుకొచ్చారు. కానీ తమను ప్రశ్నించడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఈ వివాదం పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. వైసీపీ నేతలకు పవన్ కౌంటర్ ఇవ్వడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular