Pawan Kalyan
Pawan Kalyan : అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) రాష్ట్ర వ్యాప్తగా లక్ష 30 వేల ఫార్మింగ్ పాండ్స్ నిర్మాణం పనులను ప్రారంభించాడు. అందులో భాగంగా ఆయన కర్నూలు కి విచ్చేసి, మొదటి ఫార్మింగ్ పాండ్ నిర్మాణం కి శంకుస్థాపన చేశాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా అభిమానుల తాకిడి చాలా గట్టిగా ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి కూడా అభిమానులు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు. ఆయనికి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి(Byreddy Sabari) ఘనంగా స్వాగతం పలికింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఆమె మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కేరింతలు , చప్పట్లతో హోరెత్తించేసారు. ‘ఓజీ'(They Call Him OG) నినాదాలతో కూడా ఆమెని కాస్త భయపెట్టేసారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
Also Read : బాబే సీఎం కావాలి.. పవన్ కళ్యాణ్ మాట*
ఎంపీ శబరి మాట్లాడుతూ ‘సార్ ఇక్కడ మీ అభిమానులు మమ్మల్ని స్పీచ్ ఇవ్వనివ్వరు, మిమ్మల్ని చూస్తూ ఉండేందుకే వాళ్లకు సమయం సరిపోతుంది’ అని అంటుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ వెంటనే మైక్ అందుకొని ‘మేడం..వాళ్ళు నా అభిమానులు కాదు, దేశభక్తులు..మీరు మాట్లాడండి ఏమి కాదు’ అని అంటాడు. ఇక ఆ తర్వాత శబరి మాట్లాడుతూ ‘మీకు ఎవ్వరికీ తెలియని విషయం నేను పవన్ కళ్యాణ్ గారికి మీలాగే పెద్ద అభిమానిని. నేను మొదటి సంవత్సరం MBBS చదివేటప్పుడు, మీ అభిమాన నటుడు ఎవరు అని అడిగితే నేను పవన్ కళ్యాణ్ అని చెప్పాను, అది విన్న వెంటనే మీ అభిమానులు వంద మంది నన్ను చుట్టూ ముట్టేశారు. నాకు ఎంతో మర్యాదలు చేసారు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇంకా ఈ ఈవెంట్ లో ఆమె పవన్ కళ్యాణ్ అభిమానులను ఉత్సాహపరిచే విధంగా ఎన్నో గొప్ప మాటలు మాట్లాడింది.
ఇక పవన్ కళ్యాణ్ స్పీచ్ ప్రారంభం కాగానే అందరూ ‘ఓజీ..ఓజీ’ అంటూ నినాదాలు చేసారు. అప్పుడు ఆయన దానికి సమాధానం చెప్తూ ‘మీరు మారరు అయ్యా..నేనేమో ఇక్కడ పల్లె పండుగ, రోడ్లు నిర్మాణం, పాండ్లూ నిర్మాణం అని అంటూ ఉంటే, మీరు మాత్రం ఓజీ..ఓజీ అంటారు. ఇందాక శబరి గారు అన్నట్టు మిమ్మల్ని ఆపడం కష్టమే, కానివ్వండి మీ ఇష్టం’ అని అంటాడు. ఇక ప్రసంగం చివర్లో ఉండగా అందరు ‘బాబులకే బాబు..కళ్యాణ్ బాబు’ అంటూ నినాదాలు చేయగా, నా పేరు ని అలా తల్చుకునే బదులు గోవింద నామస్మరణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తెలుసా అని అంటాడు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.