Honda Electric Scooter
Honda QC1 : మన దేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలోనే అన్ని కంపెనీలు తమ ఎలక్ట్రిక్ మోడల్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. దేశంలోని రెండో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు హోండా కూడా ఇప్పటికే ఎన్నో మోడల్స్ రిలీజ్ చేసింది. హోండా గతేడాది చివరిలో 2 అద్బుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. వాటిలో ఒకటి హోండా QC1, హోండా యాక్టివా-ఇ. హోండా QC1 మధ్య తరగతి బడ్జెట్లో కంపెనీ సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చింది. దీని ఎక్స్-షోరూమ్ ధర ఢిల్లీలో రూ. 90 వేలు.
Also Read : పవర్ ఫుల్ 150సీసీ ఇంజిన్ తో మార్కెట్లో కొత్త బజాజ్ సీఎన్జీ
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక ఫీచర్లతో కూడి ఉంది. దీనిలో వచ్చిన 5అద్భుతమైన ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
1. దీని లోపల 5-అంగుళాల స్క్రీన్ లభిస్తుంది. దీనిలో మీరు బ్యాటరీ పర్సంటేజీ, ట్రిప్, ఓడోమీటర్, స్పీడోమీటర్, ముందు వైపు రేంజ్ వంటి సమాచారాన్ని చూడవచ్చు.
2. మీరు స్కూటర్‌లో 2 రన్నింగ్ మోడ్‌లను పొందుతారు. దీని కోసం హ్యాండిల్ రైడ్ సైడ్‌లో ఒక స్విచ్ అందించింది. రన్నింగ్ మోడ్‌లో స్టాండర్డ్, ఎకానమీ ఆప్షన్‌లు ఉన్నాయి. మీరు ఎకానమీ రన్నింగ్ మోడల్‌కి మారితే స్కూటర్లు మంచి మైలేజీని అందిస్తాయి.
3. మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి స్కూటర్‌లో సీ టైప్ ఛార్జింగ్ పోర్టు కూడా ఉంటుంది. పెద్ద నగరాల్లో ఎక్కువగా ప్రయాణించే వాళ్ల కోసం నావిగేషన్ ఆఫ్షన్ కూడా అందించింది.
4. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో సీటు కింద 26 లీటర్ల స్టోరేజ్ స్పేస్ కూడా ఉంటుంది. దీనిలో మీరు మీ హెల్మెట్‌ను పెట్టుకోవచ్చు. ఇది కాకుండా, కొన్ని ఇతర వస్తువులు, కూరగాయలను కూడా ఉంచుకోవచ్చు.
5. దాని లోపల మీరు 1275ఎంఎం అద్భుతమైన వీల్‌బేస్‌ను కూడా అందించారు. దీనివల్ల మీకు ముందు భాగంలో మంచి లెగ్‌రూమ్ ఉంటుంది. బైక్ స్కూటర్ నడుపుతున్నప్పుడు మీరు ఫ్రీగా ఉండొచ్చు.
హోండా QC1 అనేది కేవలం 1 వేరియంట్, 5 రంగులలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ముందు, వెనుక రెండింటిలోనూ డ్రమ్ బ్రేక్‌లతో లభిస్తుంది. హోండా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ 1.5kWh ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది ఒకసారి ఛార్జి చేస్తే 80 కి.మీ రేంజ్ అందిస్తుంది. QC1ని 4.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు.
Also Read : అట్లర్ ప్లాప్ గా హీరో స్ప్లెండర్, హోండా యాక్టీవా.. ఎలా అంటే ?