Pawan Kalyan: గిరిజనుల విషయంలో పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) అభిమానం వెలకట్టలేనిది. గిరిజనుల సంక్షేమంపై ఆది నుంచి దృష్టి పెడుతూ వచ్చారు పవన్ కళ్యాణ్. ఇటీవల డిప్యూటీ సీఎం హోదాలో మన్యంలో పర్యటించారు. కొండ శివారు ప్రాంతాలను సైతం సందర్శించారు. కాలినడకన వెళ్లి గిరిజనుల పరిస్థితిని తెలుసుకున్నారు. అడవి తల్లి బాట పట్టి వందలాది కిలోమీటర్ల రహదారులకు శంకుస్థాపన చేశారు. విదేశాల్లో ఉన్న తన కుమారుడు ప్రమాదానికి గురయ్యాడని తెలిసినా.. గిరిజన ప్రాంతాల్లో పర్యటన ముగించుకుని మాత్రమే బయలుదేరి వెళ్లారు. గిరిజనుల విషయంలో పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని చూసిన అన్ని రాజకీయ పార్టీల నేతలు అభినందించారు కూడా. కేవలం ఒక గిరిజన మహిళకు ఇచ్చిన మాటకు కట్టుబడి.. ప్రమాదంలో ఉన్న తన కుమారుడి వద్దకు వెళ్లకుండా.. కార్యక్రమాలను ముగించుకొని వెళ్లారు పవన్ కళ్యాణ్.
Also Read: ఈసారి విజయసాయిరెడ్డి ఏ బాంబు పేల్చుతారో?
* తన సొంత డబ్బులతో..
అయితే ప్రభుత్వ పరంగానే కాకుండా.. తన వ్యక్తిగతంగా కూడా గిరిజనులకు అండగా నిలుస్తుంటారు. మొన్న ఉగాదికి గిరిజన మహిళలకు తన సొంత డబ్బులతో కొనుగోలు చేసిన చీరలు పంపించారు. తరచూ ఆయన కష్టాల్లో ఉన్న వారికి తన సొంత నిధుల నుంచి సాయం అందిస్తుంటారు. తాజాగా గిరిజనులకు వినూత్న కానుకలు పంపించారు. వారికి రక్షగా ఉంటానని మరోసారి నిరూపించుకున్నారు. ఈ విషయాన్ని అభిమానులు సోషల్ మీడియాలో( social media) పంచుకున్నారు. గిరిజనులకు పెద్ద ఎత్తున సొంత డబ్బులతో చెప్పులు సమకూర్చినట్లు తెలుస్తోంది. చాలామంది గిరిజనులకు పాదరక్షలు లేకపోవడంతో.. పవన్ సాయం చేశారు.
* పదివేల మందికి చీరలు..
ఈ ఏడాది ఉగాది పండుగనాడు పిఠాపురం( Pithapuram ) నియోజకవర్గంలో పదివేల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయించారు పవన్ కళ్యాణ్. తనను ఆదరించి గెలిపించిన ప్రతి కుటుంబానికి తాను పసుపు కుంకుమ కింద వీటిని పంపిస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. స్వయంగా ఆయన హాజరు కాలేదు కానీ.. పార్టీ నేతలతో వాటిని పంపిణీ చేశారు. దీంతో అప్పట్లో పవన్ అభిమానానికి ఫిదా అయ్యారు పిఠాపురం నియోజకవర్గ మహిళలు. పవన్ కళ్యాణ్ పై మరింత అభిమానాన్ని పెంచుకున్నారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో సైతం పవన్ కళ్యాణ్ తన గ్రాఫ్ ను అమాంతం పెంచుకోగలిగారు.
* వారిని చూసి చలించిపోయి
ఇటీవల పవన్ ఉమ్మడి విశాఖ( Visakha district ) జిల్లాలోని మన్య ప్రాంతంలో పర్యటించిన సంగతి తెలిసిందే. అడవి తల్లి పాట పేరుతో గిరిజన ప్రాంతాల్లో వందల కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కురిడి, పెదపాడు ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే అక్కడ రహదారులు లేకపోవడం, ముళ్ళ పొదల్లో పాదరక్షలు లేకుండా గిరిజనులు నడుస్తుండడానికి గుర్తించారు పవన్ కళ్యాణ్. వారి తీరును చూసి చలించిపోయారు. అయితే తమకు చెప్పులు కొనుగోలు చేసుకునేటంత స్తోమత లేదని వారు చెప్పడంతో షాక్ కు గురయ్యారు. తాజాగా తన సొంత సొమ్ముతో 300 మంది గిరిజనులకు నాణ్యమైన పాదరక్షలు పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది గురువారం ఆ రెండు గ్రామాల్లో పర్యటించి పాదరక్షలను పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ తమపై చూపిస్తున్న అభిమానానికి గిరిజనులు ఫిదా అయ్యారు.
Also Read: ఏపీలో ఉపాధ్యాయుల కష్టాలకు లోకేష్ చెక్.. కొత్తగా ఆ యాప్!