Pawan Kalyan: పవన్ సంచలన నిర్ణయం.. ప్రజలతోనే సమస్యలకు పరిష్కార మార్గం

పవన్ డిప్యూటీ సీఎం తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖలు తీసుకున్నారు. మొత్తం అంతా పల్లె పాలన పవన్చూడాల్సి ఉంటుంది. ప్రజల సమస్యలను గుర్తించాల్సి ఉంటుంది.

Written By: Dharma, Updated On : June 25, 2024 11:35 am

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు పవన్. పాలనలో విప్లవాత్మక మార్పులు చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రిగా తనపై ఉన్న బాధ్యతను అనుక్షణం గుర్తు చేసుకుంటూ పని చేస్తానని పవన్ చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నారు. వీలైనంతవరకూ ప్రజల నుంచి వచ్చిన వినతులకు పరిష్కార మార్గం చూపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజాక్షేత్రంలో సమస్యలను నేరుగా చూస్తున్న ప్రజల నుంచే.. ఆ సమస్యల పరిష్కారానికి కావాల్సిన సలహాలను, సూచనలను గ్రహించాలని పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

పవన్ డిప్యూటీ సీఎం తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖలు తీసుకున్నారు. మొత్తం అంతా పల్లె పాలన పవన్చూడాల్సి ఉంటుంది. ప్రజల సమస్యలను గుర్తించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తన శాఖలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని పవన్ భావిస్తున్నారు. అందుకు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. గూగుల్ ఫామ్ ద్వారా సలహాలు సూచనలు కోరుతున్నారు. ఎవరైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే క్యూఆర్ కోడ్ ద్వారా గూగుల్ ఫామ్ పూర్తి చేసి పంపించాలని సూచిస్తున్నారు. పవన్ మొదలుపెట్టిన కొత్త సాంకేతిక ప్రక్రియ మార్గదర్శకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. మిగతా మంత్రులు కూడా దీనికి ఫాలో అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పాలనలో మార్పులు తీసుకురావాలన్నదే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రజలకు వాస్తవ పరిస్థితిని వివరించి.. వారికి సమస్యల పట్ల అవగాహన పెంచేలా చూసేందుకే పవన్ ఈ విధానాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫామ్ కు సంబంధించిన లింకును జనసేన పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. పాలతో ప్రజలను నేరుగా భాగస్వాగతం చేయడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం చర్చకు దారితీస్తోంది. అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడం ఏపీ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ఉపయోగపడుతుందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే దీనిపై సమగ్ర అవగాహనతో పాటు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే బాధ్యతలు తీసుకున్నాక పవన్ వేస్తున్న అడుగులు మాత్రం అభినందనలు అందుకుంటున్నాయి.