https://oktelugu.com/

AP DSC Posts: జిల్లాల వారీగా డీఎస్సీ ఖాళీలు ఇవే..

సోమవారం(జూన్‌ 24న) సుదీర్ఘంగా జరిగిన కేబినెట్‌ సమావేశంలో చంద్రబాబు సంతకాలు చేసిన మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల ప్రారంభం, ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ రద్దు, స్కిల్‌ సెన్ సెస్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Written By:
  • Dharma
  • , Updated On : June 25, 2024 / 11:40 AM IST

    AP DSC Posts

    Follow us on

    AP DSC Posts: అధికారంలోకి వస్తే మెగా డీఎస్పీ ఫైల్‌పైనే తొలి సంతకం పెడతానని ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్పీ ఫైల్‌పై సంతకం చేశారు. తాజాగా ఏపీ కేబినెట్‌ కూడా మెగా డీఎస్సీకి ఆమోదం తెలిపింది. సోమవారం(జూన్‌ 24న) సుదీర్ఘంగా జరిగిన కేబినెట్‌ సమావేశంలో చంద్రబాబు సంతకాలు చేసిన మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల ప్రారంభం, ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ రద్దు, స్కిల్‌ సెన్ సెస్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరణకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో ఏపీలో జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఖాళీల వివరాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

    జిల్లాల వారీగా పోస్టులు ఇవీ..
    16,347 పోస్టులతో జూలై 1న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. జిల్లాలు, మండల పరిషత్, మున్సిపల్‌ స్కూళ్లలో 14,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో 543, విజయనగరంలో 583, విశాఖపట్నం 1,134, తూర్పుగోదావరి జిల్లా 1,346, పశ్చిమగోదావరి 1,067, కృష్ణా 1,213, గుంటూరు 1,159, ప్రకాశం 672, నెల్లూరు 673, చిత్తూరు 1,478, కడప 709, అనంతపురం811, కర్నూలు 2,678 ఖాళీలు ఉన్నాయి.

    రెసిడెన్షియల్‌ స్కూల్లలో 2,281 పోస్టులు..
    ఇక ఏపీలోని రెసిడెన్షియల్, మోడల్‌ స్కూళ్లు, బీసీ, ఎస్సీ, గిరిజన గురుకుల పాఠశాలల్లో మరో 2,281 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పోస్టుల భర్తీకి జూలై 1న షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు. ఇదే సమయంలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టెట్‌ నిర్వహించడం ద్వారా మరింత మంది డీఎస్సీకి అర్హత సాధిస్తారని సమాచారం.