Balineni Srinivas Reddy : వైసీపీలో చాలా యాక్టివ్ గా పని చేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వైసిపి ఓడిపోయిన తర్వాత ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని పెంచుకున్నారు.వ్యూహాత్మకంగా జనసేన పార్టీలో చేరారు. వైసిపి ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేసిన నేతల్లో బాలినేని ఒకరు.ప్రకాశం జిల్లా కు చెందిన బాలినేని జగన్ కు సమీప బంధువు కూడా. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు బాలినేని. 2004లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో అదే కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పదవి అందుకున్నారు. కానీ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్ వైసీపీని ఏర్పాటు చేశారు. జగన్ కోసం తన మంత్రి పదవిని వదులుకున్నారు బాలినేని.అయితే అదే బాలినేని పదేళ్ల తర్వాత జగన్ తో పాటు వైసిపికి దూరమయ్యారు. జనసేనలో చేరారు. ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు.
* ఆ హామీ తోనే..
అయితే వైసీపీతో చాలా రోజులుగా విభేదించి.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు బాలినేని. ఎన్నికలకు ముందు టిడిపి అధినేత చంద్రబాబుతో సమావేశం అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో బాలినేనికి తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదు జగన్. ఓటమి తర్వాత కూడా బాలినేని పోరాటానికి జగన్ పెద్దగా మద్దతు తెలపలేదు.దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలినేని జనసేనలోకి వెళ్లారు.అయితే ఎమ్మెల్సీ తో పాటు ప్రభుత్వంలో కీలకని ఆయన జనసేనలో చేరినట్లు తెలుస్తోంది.
* ఎమ్మెల్సీ వరకు ఓకే
అయితే ఇప్పుడు బాలినేని కోసం పవన్ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. బాలినేని కి ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే బాలినేని విషయంలో ప్రకాశం జిల్లాలో టిడిపి నేతలు అభ్యంతర కరంగా ఉన్నారు. ఆయన రాకను స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యతిరేకించారు. మరోవైపు ప్రకాశం జిల్లాలో ఇద్దరికీ మంత్రి పదవులు కూడా ఉన్నాయి. ఇప్పుడు బాలినేని మంత్రి పదవి ఇవ్వడం అంటే సాహసంతో కూడుకున్న పని. అందుకే ఎమ్మెల్సీ వరకు ఓకే కానీ మంత్రి పదవి విషయంలో మాత్రం చంద్రబాబుపెద్దగా ఆసక్తి చూపించినట్లు లేదు.అయితే జనసేన తరఫున రెడ్డి సామాజిక వర్గానికి పదవి ఇవ్వాలనుకున్నామని.. తద్వారా కూటమికి మంచి జరుగుతుందని పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఒప్పించారట. అయితే పవన్ విషయంలో చంద్రబాబు చాలా రకాల ఆలోచన చేస్తారు. తప్పకుండా పవన్ ప్రతిపాదనకు ఓకే చెబుతారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.