Allu Arjun: ప్రస్తుతం పాన్ ఇండియాలో పుష్ప 2 సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా మొదటి రోజు భారీ కలెక్షన్లను వసూలు చేస్తుంది అంటూ సినిమా మేకర్స్ అయితే భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ ని కూడా డిసెంబర్ 4వ తేదీ నైట్ నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ సినిమా మొదటి రోజు త్రిబుల్ ఆర్ సినిమా రికార్డును బ్రేక్ చేయడం పక్క అంటూ చాలామంది కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ‘త్రిబుల్ ఆర్’ సినిమా మొదటిరోజు 250 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది. ఇక ఆ రికార్డును బ్రేక్ చేస్తూ పుష్ప 2 సినిమా 300 కోట్లకు పైన కలెక్షన్స్ ను ఈజీగా రాబడుతుంది అంటూ విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఈ సినిమా చూడడానికి చాలామంది జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షో ల కోసం టికెట్లను అన్ లోనే లో పెడితే కేవలం గంటలోపే 50 వేల టికెట్లు అమ్ముడుపోవడం అనేది పుష్పం మేనియా ఏ రేంజ్ లో ఉందో తెలియజేస్తుంది. ఇక అమెరికాతో పోల్చుకుంటే ఇండియా లో ఈ సినిమాకి భారీ క్రేజీ అయితే దక్కనుంది.
కాబట్టి ప్రీమియర్ షో లతో కలుపుకొని ఈ సినిమా మొదటి రోజు 300 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతుందనే కాన్ఫిడెంట్ ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ తన స్టామినా ను విస్తరింపజేస్తూ ముందుకు సాగుతూ ఉండడం చాలా గొప్ప విషయమనే చెప్పాలి. దీంతో అల్లు అర్జున్ ఒకేసారి రాజమౌళి,ఎన్టీయార్, రామ్ చరణ్ ల రికార్డ్ లను క్రియేట్ చేయబోతున్నట్టు గా తెలుస్తోంది.
మరి తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ భారీ కలెక్షన్లను కొల్లగొట్టే సత్తా ఉన్న హీరో అల్లు అర్జున్ కావడంతో ఇప్పుడు మిగతా హీరోలందరు అల్లు అర్జున్ చూసి కాస్త భయంతో వెనకడుగు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే అల్లు అర్జున్ మేనియా ఇంతకుముందులా లేదు ఇందులోనే ఆయన స్టార్ డమ్ అనేది పీక్ స్టేజ్ లోకి వెళ్లిపోయింది.
ప్రస్తుతం ఆయన నుంచి ఒక సినిమా వచ్చింది అంటే చాలు అది ఈజీగా 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టేంత స్టార్ డమ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తన సినిమా కలెక్షన్లతో త్రిబుల్ ఆర్ సినిమాకి చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…