Kiran Rayal : జనసేన( janasena) నేతలపై వరుసగా వస్తున్న ఆరోపణలతో ఆ పార్టీ నాయకత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ముఖ్యంగా మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పుడు తాజాగా తిరుపతికి చెందిన కిరణ్ రాయల్ వ్యవహారం పెను దుమారానికి దారితీసింది. ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. దీంతో జనసేన నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిరణ్ రాయల్ పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని పవన్ ఆదేశించారు. అంతర్గత విచారణ పూర్తయ్య వరకు కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. అయితే ఇంత జరిగిన తరువాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మాత్రమే ఆదేశాలు ఇవ్వడం పై అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పరువు పోయాక ఈ దిద్దుబాటు చర్యలు ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ వీడియోలు వచ్చిన వెంటనే స్పందించాల్సి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
* జనసేనలో బలమైన నేత
కిరణ్ రాయల్( Kiran rayal ) జనసేనలో కీలక నేతగా ఉన్నారు. పార్టీ వాయిస్ను గట్టిగానే వినిపిస్తూ వచ్చారు. ముఖ్యంగా వైసీపీ పై విమర్శలు చేయడంలో ముందుంటారు. లాజిక్ గా మాట్లాడతారు. మొన్నటికి మొన్న లోకేష్ డిప్యూటీ సీఎం వ్యవహారం పెను దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కిరణ్ రాయల్ మాట్లాడారు. టిడిపి శ్రేణులకు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఉన్నట్టే.. సగటు జనసేన అభిమానికి పవన్ కళ్యాణ్ సీఎం పదవి చేపట్టాలని ఉంటుందని కుండబద్దలు కొట్టి మాట్లాడారు. అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ కిరణ్ రాయల్ తో ఆ ప్రకటన చేసి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అటువంటి కిరణ్ రాయల్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొనడం విశేషం. కిరణ్ రాయల్ జనసేనలో కీరోల్ ప్లే చేస్తున్నారు అని స్పష్టమవుతోంది. అటువంటి నేతపై ఆరోపణలు రావడం అనేది జనసేనకు ఇబ్బందికరమే.
* తిరిగి ఫిర్యాదు
తనకు కోటి రూపాయలు ఇవ్వాలంటూ కిరణ్ రాయల్ పై( Kiran rayal ) ఓ మహిళ ఆరోపణలు చేయడం.. అందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడం కలకలం రేపింది. అంతటితో ఆగకుండా ఆమె చాలా రకాలుగా ఆరోపణలు చేశారు. అయితే ఆ మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. 2013లో తీసుకున్న డబ్బులు ఎప్పుడో తిరిగి ఇచ్చేసానని.. కానీ మార్ఫింగ్ వీడియోలతో వైసిపి నేతలు ఆ మహిళతో కలిసి కుట్ర పన్ని ఇలా చేస్తున్నారని కిరణ్ రాయల్ తిరిగి ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు కూడా కిరణ్ రాయల్ స్పష్టం చేశారు.
* సోషల్ మీడియాలో వైరల్
కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో( social media) వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా వైసిపి సోషల్ మీడియా విభాగం అదే పనిగా ట్రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జనసేన పరువు పోతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందన ఎలా ఉంటుంది అని అందరూ ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టానికి ఎవరు అతీతులు కాదని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. సమాజానికి ప్రయోజనం లేని విషయాలను పక్కనపెట్టి.. సమాజానికి ఉపయోగపడే అంశాలపై దృష్టి సారించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ సూచించినట్లు అందులో పేర్కొన్నారు. అయితే పార్టీ పరువు పోయిందని.. ఇప్పుడు చర్యలు తీసుకుంటే వచ్చేదేమీ లేదని సొంత పార్టీ నుంచి ఒక రకమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మనల్ని ఎవడ్రా ఆపేది!
జనసేన నేత కిరణ్ రాయల్ బాగోతం. #Janasena #KiranRayal #AndhraPradesh #UANow #PawanKalyan pic.twitter.com/hYfootNgzJ
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) February 9, 2025