Pawan Kalyan vs RGV: పవన్ కళ్యాణ్( Pawan Kalyan) సినిమా అనగానే చాలా రకాల అంశాలు బయటకు వచ్చేవి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ. పవన్ సినిమా విడుదలైన వెంటనే తన చేతికి పని చెప్పేవారు. ఆ సినిమాపై రివ్యూ చేసేవారు. తనదైన రీతిలో వ్యంగ్యంగా, వెటకారంగా తన సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేవారు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు ఇటీవల రెండు విడుదలయ్యాయి. కానీ రామ్ గోపాల్ వర్మ వాటి జోలికి పోలేదు. వాటి గురించి మాట్లాడే సాహసం చేయలేదు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో తన నోటితో పాటు తన చర్యలకు సైతం ఫుల్ స్టాప్ పెట్టారు రామ్ గోపాల్ వర్మ.
తనకంటూ ఒక ప్రత్యేకత..
భారత చిత్ర పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. శివ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండును పరిచయం చేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ క్రమంలోనే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు ఎదిగారు. అయితే రాజకీయాల వైపు మళ్లడంతో.. తన సినిమాలతో సగటు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతున్నారు. ప్రధానంగా ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారు. టిడిపి తో పాటు జనసేన ను తీవ్రంగా వ్యతిరేకించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపేవారు. ఈ క్రమంలో తన విభిన్నమైన తెలివితేటలను ఉపయోగించేవారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరోక్ష సహకారం అందించారు. ఈ క్రమంలోనే ఆయన అడ్డంగా బుక్కయ్యారు. మునుపటిలా స్వేచ్ఛగా తన భావాన్ని ప్రకటించలేకపోతున్నారు.
మెగా ఫ్యామిలీ పై అక్కసు
రాంగోపాల్ వర్మ ఎందుకో మెగా ఫ్యామిలీ పై విరుచుకు పడేవారు. రాజకీయంగా విమర్శిస్తూ.. ఇటు సినిమాల పరంగా కించపరుస్తూ పైశాచిక ఆనందాన్ని పొందేవారు. తాను సైతం మెగా అభిమానిని అంటూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బై హార్ట్ ఫ్యాన్ అంటూ మెగా అభిమానులను రెచ్చగొట్టేలా వ్యవహరించేవారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదులు పెరిగాయి. ఆయనపై కేసులు నమోదయ్యాయి. అరెస్టులకు సైతం రంగం సిద్ధం అయ్యింది. దీంతో ఆయన కోర్టుకు వెళ్లి ఉపశమనం పొందాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు ఈ వివాదాస్పద అంశాల జోలికి పోకుండా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు రామ్ గోపాల్ వర్మ.