Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Godavari Pushkaralu Plan: గోదావరి పుష్కరాల కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...

Pawan Kalyan Godavari Pushkaralu Plan: గోదావరి పుష్కరాల కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్.. వైరల్ అవుతున్న వీడియో..

Pawan Kalyan Godavari Pushkaralu Plan: ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మన గోదావరి పుష్కరాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాజమండ్రి లో జరిగే ఈ పుష్కరాలకు దేశం నలుమూలల నుండి మాత్రమే కాదు, ఇతర దేశాల నుండి కూడా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆర్చరించి వెళ్తుంటారు. ఇక్కడ స్నానం ఆచరిస్తే , ఎన్నో ఏళ్ళ నుండి మూటగట్టుకున్న పాపపు కర్మలన్నీ తొలగిపోతాయని, బలమైన విశ్వాసం భక్తుల్లో ఉంటుంది. ప్రతీ 12 ఏళ్లకు అత్యంత వైభోగంగా జరిగే ఈ పుష్కరాలు వచ్చే ఏడాది గ్రాండ్ గా జరగబోతున్నాయి. కూటమి ప్రభుత్వానికి ఈ పుష్కరాలను సమర్థవతంగా నిర్వహించడం ఇప్పుడు పెద్ద సవాల్. అయితే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏడాది లో జరగబోయే పుష్కరాలకు , ఇప్పటి నుండే పటిష్టమైన ఏర్పాట్లు చేయడానికి సిద్దమయ్యాడు, అందుకోసం నేడు ఆయన రాజమండ్రి లో పర్యటించడం, అక్కడి పరిస్థితులను సమీక్షించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యంగా గోదావరి నదులు కలుషితం అవ్వడం పై పవన్ కళ్యాణ్ చాలా కఠినమైన జాగ్రత్తలు రాబోయే రోజుల్లో తీసుకోబోతున్నాడు. అందుకోసం రాబోయే రోజుల్లో కాలుష్య నివారణ శుద్ధి ప్లాంట్లను నిర్వహించాలని అధికారులను ఆదేశించాడు పవన్ కళ్యాణ్. మూడు నెలలకు ఒకసారి కాలుష్య నియంత్రణ మండలి ఆడిట్ ని నిర్వహిస్తుందని, పుష్కరాల నిర్వహణలో పారిశ్రామికవేత్తలు సామజిక బాధ్యత తో వ్యవహరించి చొరవ తీసుకోవాలని, వాళ్ళను మా ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదు కాబట్టి , వాళ్ళు సంపూర్ణంగా మాకు సహకరించాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా, అధికారులతో నీటిని టెస్ట్ కూడా చేయించాడు. గోదావరి పుష్కరాలు కేవలం ఒక్క రాజమండ్రి కి మాత్రమే పరిమితం కాకూడదని, ప్రతీ గోదావరి గట్టు ని ఉపయోగించుకోవాలని , అందుకు తగ్గ ప్రణాళికని రూపొందించి, ఒక బ్లూ ప్రింట్ ని కేంద్రానికి పంపిస్తే నిధులు మంజూరు చేస్తారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.

పుష్కరాలు విజయవంతం అవ్వడానికి ప్రతీ ఒక్కరు కలిసి రావాలని , వచ్చే ఏడాది జరగబోయే ఈ పుష్కరాలు దేశ ప్రజలు జీవితాంతం గుర్తించుకునేలా నిర్వహించాలని, కేవలం ప్రణాళికలు పేపర్ కి మాత్రమే పరిమితం కాకూడదని , ప్రతీ నెల స్వయంగా నేనే నెలకు మూడు సార్లు విచ్చేసి ఏర్పాట్లను పరిశీలిస్తానని , 6 నెలల్లో నా కళ్ళ ముందు మార్పులు కనపడాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ రాజముండ్రి పర్యటనకు సంబంధించిన ఫోటోలు , వీడియోలే కనిపిస్తున్నాయి.
Deputy CM Pawan Kalyan LIVE: పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ LIVE | NTV Telugu

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version