Pawan Kalyan Mata Manthi Program: పవన్ కళ్యాణ్ నిన్న నిర్వహించిన మాటామంతి కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉంది. ఉద్యోగులతో ఈ విధంగా జరిగిన చర్చను ఇప్పటివరకూ చూడలేదు. పంచాయితీ రాజ్, గ్రామాణాభివృద్ధి శాఖలో ఇంతటి సంస్కరణలు, అభివృద్ధి ఎప్పుడూ చూడలేదు. పల్లెపండుగ, తిరంగ ఉత్సవాలు, గ్రామాలకు నిధులు, క్లస్టర్ విధానాలు రద్దు చేసి.. పంచాయితీలకు సర్వ స్వతంత్రంగా తీసుకొచ్చాడు పవన్. గ్రేడ్లుగా పంచాయితీలను చేసి ప్రతీ పంచాయితీకి ఉద్యోగులు, వారి గ్రేడ్లు అమలు చేసి వారికి భరోసా కల్పించడం.. మ్యాజిక్ డ్రైన్లు తీసుకురావడం.. జలజీవన్ కింద రక్షిత మంచినీటి సరఫరాను అన్ని గ్రామాలకు అందించడం.. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను నేరుగా పంచాయితీలకు చెప్పడం.. ఇలా తన శాఖలకు జవసత్వాలను పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు.
దీనికి తోడు నిన్న జరిగిన మాటా మంతీ చూశాక.. ఉద్యోగుల కళ్లల్లో ఆనందం కనిపించింది. ఎంత ట్రాన్స్ పరెంట్ గా పనిచేస్తున్నాడనానికి ఇదే ఒక గొప్ప ఉదాహరణ.
మాటా మంతీ కార్యక్రమం అధికారులను, ఉద్యోగులను కలగలిపి అధికారులు, ఉద్యోగులను కలిపి చిట్ చాట్ చేయడం.. తాను అందులో ప్రత్యక్షంగా పాల్గొని వారి గొంతుకను వింటూ సమస్యలను పరిష్కరించడం నిజంగా పవన్ కళ్యాణ్ చేసిన పని ఇప్పటివరకూ చూడలేదు.
తన శాఖల ఉద్యోగుల కళ్ళల్లో ఆనందాన్ని తెచ్చిన పవన్ కళ్యాణ్.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
