Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Latest News: జగన్ కు రిటర్న్ గిఫ్ట్ అవుతోందా?

YS Jagan Latest News: జగన్ కు రిటర్న్ గిఫ్ట్ అవుతోందా?

YS Jagan Latest News: ఏపీలో కూటమి దూకుడు మీద ఉంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తోంది. ఈనెల 12 నాటికి తన రెండేళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. అదే సమయంలో ఘోర ఓటమితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై రెండేళ్లు అవుతుంది. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పును ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అయితే పుంజుకోవడం పక్కన పెడితే ఆ పార్టీకి అవినీతి కేసులు వెంటాడుతున్నాయి. పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. అయితే ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిపై కేసులు నమోదు అవుతున్నాయి. కొందరి అరెస్టులు కూడా జరిగాయి. కానీ అధినేత జగన్మోహన్ రెడ్డి రిలాక్స్ మూడ్ లో ఉన్నారు. ఆ పార్టీ నేతలు కేసులతో అరెస్టు అయితే దానిని సానుభూతి కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు నేరుగా ఆయనే డేంజర్ జోన్ లో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

దర్యాప్తు సంస్థల షాక్..
కూటమి రెండేళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వారంలోనే జగన్ హయాంలో జరిగిన అతిపెద్ద స్కాం కు సంబంధించిన ఆధారాలు బయటపడబోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీని కుదిపేసిన రూ.3,500 కోట్ల భారీ మద్యం కుంభకోణం దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు పాత్రధారులు చుట్టూ విచారణ సాగింది. ఇక అంతిమ లబ్ధిదారుడు టార్గెట్ అన్నట్టు ప్రచారం నడుస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడి మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన వేల కోట్లను మైనింగ్, రియల్ ఎస్టేట్ రంగాల్లోకి హవాలా మార్గంలో దారి మళ్లించినట్లు ఆధారాలు లభించాయి. ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు నోటీసులు జారీ చేసి.. నేరుగా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

పిఏ అడ్డంగా దొరకడంతో..
అయితే ఇంతకాలం పార్టీ నేతలతో పాటు అప్పట్లో పనిచేసిన అధికారుల చుట్టూ విచారణ కొనసాగింది. అయితే జగన్మోహన్ రెడ్డి మాజీ పిఏ నాగేశ్వర్ రెడ్డి నివాసాలపై కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం దాడులు జరిపింది. లిక్కర్ సిండికేట్ కు, మాజీ ముఖ్యమంత్రి కి మధ్య ఈ అనే ప్రధాన అనుసంధాన కర్తగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న బినామీ ఆస్తుల పత్రాలు, డిజిటల్ డైరీలు జగన్ రెడ్డి పాత్రను ఆధారాలతో సహా నిరూపించేలా ఉన్నాయని ఒక టాక్ నడుస్తోంది. ఒక విధంగా తన పిఏ అత్యంత ఆప్తుడు అనుకోవాలి. అతని ఇంట్లోనే ఆధారాలు దొరకడంతో జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్ లో పడిపోయారు. దీనికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో అయితే విస్తృతమైన ప్రచారం నడుస్తోంది. విచారణకు పిలవడమే కాదు అరెస్టు కూడా రంగం సిద్ధం అవుతున్నట్లు టాక్ నడుస్తోంది.

సెంటిమెంట్ అస్త్రం..
మరోవైపు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి. ఒకవేళ దర్యాప్తు సంస్థలు గట్టి చర్యలకు దిగితే దీనిని రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరించి సెంటిమెంటును రగిలించాలని జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే గతం మాదిరిగా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పట్లో సానుభూతి ఉండేది. కానీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు దించేశారు. తద్వారా ఏ స్థాయిలో ప్రజావ్యతిరేకతను ఆయన మూటగట్టుకున్నారో స్పష్టం అవుతోంది. ఇటువంటి సమయంలో ప్రజలు కూడా నమ్మే స్థితిలో లేరు. జగన్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు. అంతేతప్ప అరెస్టు చేయరు అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version