Prabhas
Prabhas : ఈ రోజుల్లో మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు మారుతి. ఆ జనరేషన్ యూత్ ని దృష్టిలో పెట్టుకుని రొమాంటిక్ క్రైమ్ కామెడీ మూవీ చేశాడు. జోక్స్, సన్నివేశాలు ఒకింత అసభ్యంగా ఉంటాయి. చెప్పాలంటే బూతు కామెడీ. కానీ ఈ రోజుల్లో మూవీ బాగా ఆడింది. దాంతో మొదటి చిత్రంతోనే మారుతి హిట్ కొట్టాడు. రెండో చిత్రం బస్ స్టాప్ సైతం ఇదే తరహాలో ఉంటుంది. మారుతికి పేరు తెచ్చిన చిత్రం మాత్రం భలే భలే మగాడివోయ్. అప్పటికి సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న నాని, మారుతికి ఆఫర్ ఇచ్చాడు.
మతి మరుపు హీరో ప్రేమకథను కామెడీ, ఎమోషనల్ యాంగిల్ లో చెప్పి మారుతి మంచి విజయం అందుకున్నాడు. నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన భలే భలే మగాడివోయ్ ఆద్యంతం అలరిస్తుంది. మారుతి దర్శకత్వం వహించిన ప్రతిరోజూ పండగే మరో భారీ హిట్. సాయి ధరమ్ తేజ్ నటించిన కామెడీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ముప్పై కోట్లకు పైగా షేర్ రాబట్టినట్లు సమాచారం. అయితే గోపీచంద్ తో చేసిన పక్కా కమర్షియల్ మాత్రం నిరాశపరిచింది.
Also Read : కేవలం 9 నెలల్లో ప్రభాస్ ‘స్పిరిట్’..సందీప్ వంగ ప్లానింగ్ మామూలు రేంజ్ లో లేదుగా!
అయినప్పటికీ ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరోతో మూవీ సెట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. మారుతి-ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సమ్మర్ కానుకగా విడుదల కావాల్సి ఉంది. అయితే వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. రాజాసాబ్ మూవీ హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతోందని సమాచారం. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాజాసాబ్ హిట్ కొడితే మారుతి రేంజ్ పెరుగుతుంది. ఇండియా వైడ్ ఆయన పేరు వినిపిస్తుంది.
ప్రభాస్ తో మూవీ చేస్తున్న మారుతి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మాత్రం ఆశ్చర్యం వేయక మానదు. తమది చాలా పేద కుటుంబం అని మారుతి చెప్పుకొచ్చాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మీ కుటుంబ నేపథ్యం ఏమిటని అడగ్గా… మా నాన్న అరటిపళ్ళు అమ్మేవారు. మాది చాలా పేద కుటుంబం. ఆయన రోజుకు 50 రూపాయలు సంపాదిస్తే చాలు, అదే పెద్ద మొత్తం అనుకునేవారు. నేను జాబ్ లో చేరాక నాన్నతో ఆ పని మాన్పించేశాను. నేను అన్ని పనులు చేసేవాడిని. ఆఫీస్ బాయ్ గా కూడా చేశాను.. అని మారుతి చెప్పుకొచ్చాడు.
ఒక పక్క దర్శకుడిగా సినిమాలు చేస్తూ… నిర్మాతగా కూడా మారుతి రాణిస్తున్నాడు. ప్రేమకథా చిత్రం, రొమాన్స్, లవ్ యు బంగారం.. ఇలా కొన్ని చిత్రాలు మారుతి నిర్మించాడు.
Also Read : ‘రాజా సాబ్’ ఔట్పుట్ పై ప్రభాస్ తీవ్ర అసంతృప్తి..? 80 శాతం సన్నివేశాలను మళ్ళీ రీ షూట్ చేయబోతున్నారా!
Web Title: Prabhas director maruthi life office boy banana seller
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com