Janasena in Tamil Nadu
Pawan Kalyan: ఏపీ ప్రభుత్వం( AP government) రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనుంది. ఈనెల 27న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకుగాను ప్రభుత్వం రూ.1.50 కోట్లు నిధులను విడుదల చేసింది. ఇప్పటికే అన్ని జిల్లాల యంత్రాంగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇఫ్తార్ విందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈనెల 27న విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసే రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందుకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. జిల్లా కేంద్రాల్లో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇఫ్తార్ విందుకు హాజరుకానున్నారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుపై స్పష్టత రావడం లేదు.
Also Read: కొత్త రేషన్ కార్డుల పై బిగ్ అప్డేట్.. జారీ అప్పుడే!
* ఏటా అధికారికంగా ఇఫ్తార్ విందు
ఏటా రంజాన్( Ramzan) సందర్భంగా ఇఫ్తార్( Iftar) విందు ఇస్తుంది ప్రభుత్వం. ఈ ఏడాది కూడా ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎలాంటి నిధుల కొరతలేదని అధికారులు తెలిపారు. ఈ విందులో భాగంగా ఆహారంలో నాణ్యత, ప్రోటోకాల్, సౌకర్యాల కల్పనలో అధికారులు ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తోంది. గత వైఫల్యాలు మరోసారి బయటపడకుండా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. సనాతన ధర్మం పేరిట పవన్ కళ్యాణ్ దీక్షలు చేసిన సంగతి తెలిసిందే. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రాణత్యాగానికి అయినా సిద్ధం అంటూ గతంలో పవన్ ప్రకటించారు కూడా.
* లడ్డూ వివాదం తర్వాత
తిరుమల ( Lord Sri Venkateswara)శ్రీవారి లడ్డూ వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించారు. 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టారు. అటు తరువాత తిరుపతిలో వారాహి డిక్లరేషన్ కూడా ప్రకటించారు. తాను బలమైన సనాతన ధర్మం పాటిస్తానని కూడా తేల్చి చెప్పారు. హిందూ దేవాలయాలను రక్షించడంతోపాటు ప్రత్యేక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. హిందూ ధర్మం గురించి గొప్పగా మాట్లాడిన పవన్ ముస్లింల పండుగలు పాల్గొంటారా? లేదా? అన్నది అనుమానం.
* జనసేన వర్గాల అభిప్రాయం అదే..
అయితే పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) ఎదుట మతాలను గౌరవిస్తూనే హిందూ మత పరిరక్షణ కోసం మాట్లాడారు. ఇతర మతాల విషయంలో చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని.. కానీ హిందూ మతానికి వచ్చేసరికి మాత్రం నిర్లక్ష్యం కొనసాగుతుందని మాత్రమే చెప్పుకొచ్చారు. ఎక్కడ ఇతర మతాలకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు లేవు. అందుకే ఆయన తప్పకుండా ఇఫ్తార్ విందుకు హాజరవుతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పర్వాలేదు. కానీ ఆయన ఓ పార్టీకి రాజకీయ ప్రతినిధిగా.. తన పార్టీలోని ముస్లిం కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇస్తారా? అన్నది చూడాల్సి ఉంది.