Swami Swaroopananda: స్వరూపానంద( Swaroopa Nanda ).. ఈ స్వామీజీ గురించి తెలియని వారు ఉండరు. పొలిటికల్ స్వామీజీగా గుర్తింపు పొందారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి రాజగురువుగా ఒక వెలుగు వెలిగారు స్వరూపానంద. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి డైరెక్టుగా మద్దతు పలికి వివాదాల్లో నిలిచారు. ఆయన స్థాపించిన శారదా పీఠానికి జగన్ విచ్చలవిడిగా భూములు కేటాయించారు. ఏపీలో ప్రభుత్వం మారాక కోట్లు విలువ చేసి ఆ భూ కేటాయింపులను రద్దు చేసింది. వైరాగ్యంతో స్వరూపానంద హిమాలయాలకు వెళ్తానని ప్రకటించారు. తాజాగా భూ కబ్జాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం స్వరూపానందకు నోటీసులు జారీ చేసింది.
Also Read: కొత్త రేషన్ కార్డుల పై బిగ్ అప్డేట్.. జారీ అప్పుడే!
* క్రమేపీ ఎదుగుదల
విశాఖలో అద్దె ఇంటిలో నివాసం ఉండేవారు స్వామి స్వరూపానంద. అయితే స్వామీజీగా అవతారం ఎత్తారు. విశాఖ పెందుర్తి చిన్న ముసిడివాడ( china Mushidivaada ) ప్రాంతంలో ఆశ్రమం నిర్మించారు. పక్కనే ప్రభుత్వ భూమి ఉండడంతో కలుపుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 22 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉందని తాజాగా ప్రభుత్వం ఆయనకు నోటీసులు జారీ చేసింది. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇది అక్రమమని తేలినా అధికారులు అటువైపు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ఆ 22 సెంట్ల కబ్జాకు సంబంధించి నోటీసులు ఇవ్వడం విశేషం.
* తగ్గిన ప్రాభవం
ఏపీలో ( Andhra Pradesh)కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వామీజీ ప్రభావం తగ్గింది. అయితే ఏపీ సీఎం చంద్రబాబు సైతం తనకు అత్యంత సన్నిహితుడని చెప్పుకున్నారు స్వామీజీ. అయినా సరే సర్కార్ కనికరించలేదు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం స్వామీజీకి కేటాయించిన విలువైన భూమిని వెనక్కి తీసుకుంది. అలాగే ఏపీ ప్రభుత్వం ఆయనకు కల్పించిన భద్రతను సైతం వెనక్కి తీసుకుంది. అయితే చాలా ఏళ్ల కిందటే స్వరూపానంద స్వామీజీ తన వారసుడిని ప్రకటించారు. ఆయన సైతం చిన్న ముసిడివాడ ఆశ్రమం వైపు కనిపించడం లేదు. అయితే కొద్ది రోజుల కిందట తాను హిమాలయాలకు పోయి ఎక్కువ సమయం తపస్సుకు కేటాయిస్తానని చెప్పుకున్నారు స్వామీజీ.
* ప్రతిదీ ప్రత్యేకమే
స్వరూపానంద అటు తెలంగాణలో కేసీఆర్ కి( kalvakkunta Chandrashekhar Rao ).. ఇటు ఏపీలో జగన్మోహన్ రెడ్డికి బలమైన మద్దతు దారుడుగా ఉండేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ఇద్దరికీ ఆయన దైవ సమానుడు. 2019 తర్వాత ఏపీలో స్వరూపానంద పేరు మార్మోగిపోయింది. తెలంగాణకు రెండోసారి సీఎం అయ్యారు కెసిఆర్. ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చి మరి స్వరూపానంద ఆశీర్వాదం తీసుకున్నారు. జగన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్త బలాన్ని కూడా నిర్ణయించింది ఈ స్వామివారే. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్వామీజీ ఆశ్రమానికి నిత్యం నాయకుల తాకిడి అధికంగా ఉండేది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆశ్రమం కళావిహీనం అయ్యింది. స్వామి వారు హిమాలయాలకు వెళ్లిపోయారు. మరి తాజాగా కబ్జా నోటీసులపై ఎలా స్పందిస్తారో చూడాలి.