https://oktelugu.com/

Jennifer Winget: భర్త వేరొకరితో సంబంధం.. అందరిముందే పట్టుకొని ఆ పనిచేసిన నటి

Jennifer Winget: తనను ప్రేమించి, పెళ్లి చేసుకొని ఆ తరువాత వేరొకరితో సంబంధం ఏర్పరుచుకున్న తన భర్త గురించి తెలిసిన ఓ నటి తీవ్ర మనస్థాపానికి గురైంది.

Written By: , Updated On : July 6, 2024 / 10:18 AM IST
What Jennifer Winget Said About Her Divorce From Karan Singh Grover

What Jennifer Winget Said About Her Divorce From Karan Singh Grover

Follow us on

Jennifer Winget: సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు, ఆ తరువాత కొద్ది నెలలకే విడాకులు కామన్ అయిపోయాయి. ఇటీవల ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువగా చూస్తున్నాం. అప్పుడే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న జంట నుంచి ఎప్పుడు బ్యాడ్ న్యూస్ వస్తుందోనని వారి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే తనను ప్రేమించి, పెళ్లి చేసుకొని ఆ తరువాత వేరొకరితో సంబంధం ఏర్పరుచుకున్న తన భర్త గురించి తెలిసిన ఓ నటి తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో తన కోపాన్ని ఆపుకోలేక అందరిముందే చెంప చెల్లుమనిపించింది. తాను మోసపోయానని తెలుసుకున్నాక.. అతనితో విడాకులు తీసుకుంది. అయితే తన భర్త కూడా నటుడే. ఈ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే ఈ వివరాల్లోకి వెళ్లండి..

బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని ప్రేమలు ఎక్కువకాలం ఉండవని టాక్. ఇందుకు ఉదాహరణ జెన్నీఫర్ లవ్ స్టోరీనే ఉదాహరణ. టీవీ సీరియళ్ల ద్వారా ఫేమస్ అయిన ఈ బ్యూటీని ఎవరూ మరిచిపోరు. ‘మాయ’ అనే పాత్రతో గుర్తింపు పొందిన జెన్నీఫర్ యాక్టింగ్ కు చాలా మంది ఫిదా అయి ఫ్యాన్స్ గా మారిపోయారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆమెకు విపరీతంగా ఉంది. ‘బేహద్’ సీరియల్ లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత దిల్ మిల్ గచే, కహిన్ తో హోగా, బేపన్నా వంటి సీరియళ్లలో నటించి పాపులారిటీ సాధించింది.

అయితే ఓ వైపు నటిగా ఫేమస్ అవుతుండగానే.. మరోవైపు నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ తో ప్రేమలో పడింది. కరణ్ సింగ్ సైతం టీవీ సీరియల్ నటుడే. వీరిద్దరు పలు లోకేషన్లలో కలుసుకుని స్నేహం చేశారు. ఆ తరువాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నాళ్ల పాటు హాయిగా ఉన్నా ఈ జంటలోకి ఓ అమ్మాయి వచ్చి చిచ్చు రేపింది. జెన్నీఫర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న కరణ్ టీవీ ఇండస్ట్రీకి చెందిన మరో నటితో రిలేషన్ షిప్ మెయింటేన్ చేసేవాడు. ఈ విషయం జెన్నీ ఫర్ కు తెలిసింది.

తన భర్త ఓసారి ఆ నటితో అన్యోన్యంగా ఉండడం చూసి జెన్నీఫర్ తట్టుకోలేకపోయింది. దీంతో అందరిముందే అతని చెంప చెల్లుమనిపించింది. అయితే ఈ సంఘటన 2014లో జరిగింది. అప్పటి నుంచి జెన్నీఫర్ ఒంటరిగానే ఉంటోంది. తనకు పెళ్లయిన 10 నెలలకే భర్తకు విడాకులు తీసుకున్నానంటూ వాపోయింది. ఇక అప్పటికీ, ఇప్పటికే జెన్నీఫర్ అందం తగ్గలేదు. అంతే స్థాయిలో బ్యూటీనెస్ తో ఉన్న జెన్నీఫర్ తన లేటేస్ట్ పిక్స్ ను ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసి ఆకట్టుకుంటోంది.