https://oktelugu.com/

Pawan Kalyan: చిరంజీవి పాదాలపై పడి ఏడ్చేసిన పవన్ కళ్యాణ్.. వైరల్ వీడియో…

జనసేన పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 70 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొంది భారీ విక్టరీని సాధించాడు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఎన్డీఏతో జరిగిన మీటింగ్లో పాల్గొని అక్కడి నుంచి డైరెక్ట్ గా తన అన్నయ్య అయిన మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడానికి తన ఇంటికి వెళ్ళాడు.

Written By: , Updated On : June 6, 2024 / 06:32 PM IST
Pawan Kalyan

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పోటీ చేసి తన సత్తా చాటుకున్నాడు. ఇక 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచి చాలా విమర్శలను ఎదుర్కొంది. అయినప్పటికీ ఇప్పుడు ఎన్డీఏ కూటమితో కలిసి 21 ఎమ్మెల్యే స్థానాల్లో, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 70 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొంది భారీ విక్టరీని సాధించాడు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఎన్డీఏతో జరిగిన మీటింగ్లో పాల్గొని అక్కడి నుంచి డైరెక్ట్ గా తన అన్నయ్య అయిన మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడానికి తన ఇంటికి వెళ్ళాడు.

ఇక అక్కడ మెగా ఫ్యామిలీ లో ఉన్న సభ్యులందరూ పాల్గొని పవన్ కళ్యాణ్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ ఇంట్లోకి ఎంట్రీస్తుండగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇద్దరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వెల్కమ్ చెబుతూ వచ్చారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి కనబడగానే పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అన్నయ్య కాళ్ళ మీద పడిపోయి తన గెలుపు లో ఉన్న ఆనందాన్ని చాలా గర్వంగా పంచుకున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ కంటతడి కూడా పెట్టుకున్నాడు.

ఇక ఈ సీన్ జరిగినపుడు పక్కనే ఉన్న నాగబాబు చాలా ఎమోషనల్ అయ్యాడు కంటతడి కూడా పెట్టుకున్నాడు. ఇక అనంతరం పవన్ కళ్యాణ్ భార్య కూడా చిరంజీవి కాళ్ళ మీద పడి తన బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంది. ఇక చిరంజీవి గజమాల వేసి పవన్ కళ్యాణ్ కి కంగ్రాచ్యూలేషన్స్ చెప్పాడు. మొత్తానికైతే మెగా ఫ్యామిలీ లో ఉన్న కుటుంబ సభ్యులందరూ పాల్గొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆనందాన్ని రెట్టింపు చేశారు. అనంతరం చిరంజీవి ఏర్పాటు చేసిన కేక్ కట్టింగ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వాళ్ళ వదిన అయిన సురేఖ, అమ్మ అంజనమ్మతో కలిసి కేక్ కట్ చేసి చిరంజీవి గారికి తినిపించాడు.

అనంతరం తల్లి అంజనమ్మ కాళ్ళ మీద పడి తన బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ఇక మొత్తానికైతే మెగా ఫ్యామిలీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని తెలుస్తుంది… పవన్ కళ్యాణ్ కి మొదటి నుంచి కూడా చిరంజీవి అంటే చాలా అభిమానంతో పాటు గౌరవం, ఇష్టం, ప్రేమ అన్నీ ఉన్నాయి.కాబట్టి ఎన్డీఏ తో మీటింగ్ తర్వాత డైరెక్ట్ గా చిరంజీవి దగ్గరికి వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ఇక ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది.