spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: మారిపోయిన పవన్ ప్రచార షెడ్యూల్.. ఎప్పటి నుంచి షురూ అంటే

Pawan Kalyan: మారిపోయిన పవన్ ప్రచార షెడ్యూల్.. ఎప్పటి నుంచి షురూ అంటే

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల ఫీవర్ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళుతున్నాయి. అటు అధినేతలు సైతం రంగంలోకి దిగారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు సైతం ప్రజాగళం పేరిట ఎన్నికల ప్రచారానికి దిగారు. రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈరోజు నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.

పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే అక్కడ నుంచి జనసేన కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. ఈరోజు నుంచి నాలుగు రోజులపాటు పిఠాపురం లోనే పవన్ గడపనున్నారు. జనసేన, టిడిపి, బిజెపి శ్రేణులతో సమావేశం కానున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించనున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకం కానున్నారు. పిఠాపురం తో పాటు జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాలపై పవన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ముందుగా ఆ 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనలు పూర్తి చేయనున్నారు. ఆ నియోజకవర్గాల్లో పర్యటన పూర్తయిన వెంటనే.. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. మధ్యలో భాగస్వామ్య పక్షాల అధినేతలతో భారీ బహిరంగ సభలకు హాజరుకానున్నారు.

నేటి నుంచి ప్రారంభం కానున్న పవన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ మారింది. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ షెడ్యూల్ను విడుదల చేశారు. తొలి విడతలో భాగంగా మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు పవన్ పిఠాపురంలోనే పర్యటించనున్నారు. ఏప్రిల్ 3 న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి,7న పెందుర్తి, 8న కాకినాడ గ్రామీణ, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజానగరంలో పవన్ పర్యటించనున్నట్లు తెలిపారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version