Pawan Kalyan: నేడు పవన్ కళ్యాణ్, అన్న లెజినోవా విడాకులు తీసుకున్న ఘటన నేషనల్ వైడ్ గా ఎంతటి సెన్సేషనల్ టాపిక్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గల్లీ నుండి ఢిల్లీ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ కి వ్యక్తిగతంగా ఇలాంటి పరిస్థితి రావడం అత్యంత శోచనీయం. అన్నా లెజినోవా తో ఎంతో సన్నిహితం గా ఉన్న పవన్ కళ్యాణ్ ని ఈమధ్య కాలం లోనే మనం చాలా సందర్భాల్లో చూసాము. అలాంటిది ఇంతలోపే వీళ్లిద్దరికీ ఏమైంది అనేది అంతు చిక్కని ప్రశ్న. పైగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కూడా పూర్తి స్థాయిలో బాగాలేదు. సర్జరీ కూడా జరిగింది. త్వరలోనే రెండవ భుజానికి కూడా సర్జరీ జరగనుంది. ఇలాంటి సమయం లో ఆయనకు వ్యక్తిగతం గా ఇలాంటి దెబ్బ తగలడం అనేది సాధారణమైన విషయం కాదు. దీని నుండి కోలుకోవడానికి పవన్ కళ్యాణ్ కి చాలా రోజుల సమయమే పట్టొచ్చు.
ఇదంతా పక్కన పెడితే అన్నా లెజినోవా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. అదేంటంటే ఈమె స్వతహాగా గొప్ప ఆస్తి పరురాలు. రష్యా దేశం లో ఆమెకి ఎన్నో వ్యాపారాలు పాపులర్ రెస్టారెంట్స్ ఉన్నాయట. అలా ఆమె ఆస్తుల విలువ మొత్తం 1800 కోట్ల రూపాయిల వరకే ఉంటుందని , ఈమె రాజకుటుంబానికి చెందిన అమ్మాయి అని సోషల్ మీడియా లో ఒక కథనం ప్రచారం అవుతోంది. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ , అన్నా లెజినోవా భరణం తీసుకునేంత స్థాయిలో మాత్రం లేదని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే 15 రోజుల క్రితం వరకు కూడా అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ ఇంట్లోనే ఉందట. వివాహం పరంగా వీళ్లిద్దరు విడిపోయారు కానీ , వ్యక్తిగతంగా మాత్రం మంచి స్నేహితులుగా కొనసాగుతారని , త్వరలో జరగబోయే సాయి ధరమ్ తేజ్ పెళ్ళికి కూడా అన్నా లెజినోవా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.