Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఆయన కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. మధ్య మధ్యలో సినిమా షూటింగ్లకు సైతం హాజరవుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటనలు మాత్రం రావడం లేదు. ఆయన రాజకీయాల్లో కనిపించకపోయేసరికి ఎన్నో రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఆయన అనారోగ్యంపై కూడా రకరకాల చర్చ నడుస్తోంది. గత నాలుగు రోజులుగా ఆయన పెద్దగా కనిపించలేదు. సింగపూర్ వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. అదే సమయంలో వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. జ్వరంతో పాటు స్పాండిలైటిస్ తో బాధపడుతున్నట్లు ఆ ప్రకటనలో ఉంది. అయితే పవన్ కళ్యాణ్ అంతలా బాధ పెడుతున్న ఆ స్పాండిలైటిస్ అంటే ఏమిటి? అని జన సైనికులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈరోజు జరిగే క్యాబినెట్ బేటీకి సైతం ఆయన హాజరయ్యే ఛాన్స్ లేదని సమాచారం.
* క్షణం తీరిక లేకుండా
గత సంక్రాంతికి ముందు నుంచి ఆయన సినిమా షూటింగ్లను( cinema shootings ) నిలిపివేశారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేశారు. కూటమి పార్టీల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సొంత నియోజకవర్గ పిఠాపురంలో సైతం నిత్య పర్యటనలు సాగించారు. ఎన్నికలకు ముందు క్షణం తీరిక లేకుండా గడిపారు పవన్ కళ్యాణ్. ఆ సమయంలోనే ఆయన తరచూ అనారోగ్యానికి గురయ్యేవారు. ప్రధానంగా వెన్ను నొప్పితో అసౌకర్యానికి గురయ్యేవారు. ఆయనకు మెడ నుంచి వెన్నుముక వరకు తీవ్రమైన నొప్పి వస్తుండేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అదే వెన్ను నొప్పితో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్నారని జనసేన వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
* లక్షణాలు ఇవే
అయితే స్పాండిలైటిస్( Spondylitis) తో ఇబ్బందులు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. విపరీతమైన మెడ నొప్పితో తల తిరగడం, కళ్ళు తిరిగి పడిపోవడం, నడుస్తున్న సమయంలో ముందుకు దూలిపోతున్నట్టు అనిపించడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు. వీటితో పాటు వాంతులు, వికారం వంటివి ఉంటాయని.. చేతులు, కాళ్లు తిమ్మిర్లుగా అనిపిస్తాయని అంటున్నారు. అయితే నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ప్రకటన రావడంతో జనసైనికులు ఒక రకమైన ఆందోళన వ్యక్తం అవుతోంది.
* గతంలో చాలాసార్లు
గతంలో చాలాసార్లు పవన్ కళ్యాణ్( Pawan Kalyan) ఇదే మాదిరిగా అనారోగ్యం బారిన పడ్డారు. తరువాత కోలుకొన్నారు. అయితే ఈసారి గత నాలుగు రోజులుగా ఆయన కనిపించడం లేదు. అదే సమయంలో కార్యాలయం ప్రత్యేక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఎక్కువమంది జనసైనికులు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై ఆరా తీస్తున్నారు. అయితే ఆయన హెల్త్ విషయంలో ప్రత్యేక ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు