spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Vs Jagan Kapu Politics: జగన్ 'కాపు' రాజకీయంపై పవన్ పాలి'ట్రిక్స్'

Pawan Kalyan Vs Jagan Kapu Politics: జగన్ ‘కాపు’ రాజకీయంపై పవన్ పాలి’ట్రిక్స్’

Pawan Kalyan Vs Jagan Kapu Politics: ఏపీ ( Andhra Pradesh) రాజకీయాల్లో కులం అనేది కీలకం. కుల సమీకరణలే ఈ రాష్ట్రంలో ప్రధానంగా కీలక భూమిక పోషిస్తాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఎటు ఉంటే అటు మొగ్గు ఉంటుంది. ఆ పార్టీ అధికారానికి చేరువ అవుతుంది. అందుకే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాపు సామాజిక వర్గం ఈక్వేషన్స్ తెరపైకి వస్తాయి. మొన్నటి ఎన్నికల్లో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భారీ ప్లాన్ వేశారు. కాపు నేతలను అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను డామేజ్ చేయాలని చూశారు. తద్వారా కాపు సామాజిక వర్గం ఓట్లను చీల్చాలని చూశారు. కానీ అది ఎంత మాత్రం వర్కౌట్ కాలేదు. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ డ్యామేజ్ చేసింది. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమికి అదే ప్రధాన కారణం.

Also Read: ఆ వైసిపి మాజీ ఎంపీ కి ఘోర అవమానం

* ముద్రగడ ప్రయోగం విఫలం..
సరిగ్గా ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం( mudragada Padmanabham ) లాంటి కాపు నేతలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రప్పించారు. పవన్ కళ్యాణ్ పై దారుణ విమర్శలు చేయించారు జగన్. కానీ క్షేత్రస్థాయిలో జగన్ వేసిన ఈ ప్లాన్ లు అన్ని అట్టర్ ప్లాఫ్ అయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అత్యంత చాకచక్యంగా వ్యవహరించి తాను అనుకున్నది సాధించారు. ఒక ప్లాన్ లో భాగంగానే ముద్రగడ పద్మనాభాన్ని అస్త్రంగా ప్రయోగించారు జగన్. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభంతో విమర్శలు చేయిస్తే ఆ సామాజిక వర్గంలో చీలిక వస్తుందని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఒక నటుడిగా, ప్యాకేజీ స్టార్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అక్కడే జగన్ ప్రణాళిక విడిసి కొట్టింది. ముద్రగడ లాంటి సీనియర్ నేత తన స్థాయిని మరిచి పవన్ పై విమర్శలు చేయడాన్ని కాపు యువత తట్టుకోలేకపోయింది. పైగా పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే తన పేరును పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని సవాల్ చేయడం కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.

* తగ్గినా పర్వాలేదంటున్న పవన్..
ప్రస్తుతం కూడా కాపు సామాజిక వర్గంలో చీలిక తేవాలన్నది జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) ప్రణాళిక. ఎన్నెన్నో రెచ్చగొట్టే ప్రకటనలు వైసీపీ కాపు నేతల నుంచి వస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఎక్కడా స్పందించడం లేదు. తన లక్ష్యం నుంచి పక్కకు జరగలేదు. గత అనుభవాలను గుణపాఠాలుగా మార్చుకొని కూటమి బలోపేతం చేయడం పై ఫుల్ ఫోకస్ పెట్టారు. జగన్ కాపు నేతలతో చేయిస్తున్న విమర్శలకు.. పవన్ తన మాటలతో సమాధానం చెప్పడం లేదు. ఓట్ల రూపంలో బుద్ధి చెబుతున్నారు. పాలు తగ్గిన పర్వాలేదు కానీ వైసీపీని గద్దె దించడమే పరమావధిగా అప్పుడు అడుగులు వేశారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వైసిపికి అధికారం దక్కకుండా అవసరమైతే తాను తగ్గుతానని సంకేతాలు ఇస్తున్నారు. ఇలా ఎలా చూసుకున్నా పవన్ కళ్యాణ్ ఉండగా జగన్మోహన్ రెడ్డి కాపు వ్యూహాలు అట్టర్ ప్లాఫ్ అవ్వక తప్పదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper