Pawan Kalyan And Revanth Reddy: తెలుగు చిత్ర పరిశ్రమ( Telugu cine industry) ప్రముఖులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. థియేటర్ల బంద్ పేరిట తాను నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ కోసం తాను పాటుపడుతుంటే.. తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ అసహనం వ్యక్తం చేశారు. వారికి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు పంపుతూ దీని వెనుక ఉన్న అసలు వారు ఎవరు అంటూ విచారణ చేపట్టాలంటూ ఆదేశాలు ఇచ్చారు. అయితే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. జనసేన పార్టీ నేత ఇందుకు కారణం అని చెప్పుకొచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ సదరు నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. సస్పెండ్ అయిన నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ఉన్న వ్యక్తి గురించి చెప్పారు.
* మంత్రితో భేటీ..
మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan).. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో భేటీ అయ్యారు. అయితే థియేటర్ల బందు వ్యవహారం సద్దుమణిగింది. కానీ ఈ ఎపిసోడ్ వెనుక ఉన్న కుట్ర ఏంటనేది బహిర్గతం చేయాలని పవన్ కళ్యాణ్ మంత్రిని ఆదేశించినట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమాను బంద్ పేరిట అడ్డుకోవాలని చూశారని.. అందుకే థియేటర్లలో విస్తృత తనిఖీలు చేపట్టాలని పవన్ ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల తనిఖీలు మొదలయ్యాయి. ఇటువంటి నేపథ్యంలో జనసేన బహిష్కృత నేత సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక దిల్ రాజు ఉన్నారని చెప్పడంతో ఇప్పుడు పవన్ ఆలోచనలో పడిపోయారు.
* ఆ నలుగురే పాత్రధారులు..
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ పిలుపు వెనుక దిల్ రాజు( dilraj ), అతని తమ్ముడు శిరీష్, సునీల్ నారంగ్, దగ్గుబాటి సురేష్ బాబు ఉన్నారంటూ జనసేన బహిష్కృత నేత అత్తి సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. టాలీవుడ్ లో ప్రస్తుతం రెండు రాష్ట్రాల థియేటర్లను తమ చేతిలో పెట్టుకుని వీరు ఆడిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. పైగా ఇప్పుడు దిల్ రాజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. దీంతో దిల్ రాజు పై పవన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న దానిపై చర్చ నడుస్తోంది. దిల్ రాజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కూడా. అయితే థియేటర్ల బంద్ వెనుక జనసేన నేత సత్యనారాయణ ఉన్నారంటూ బయట పెట్టారు దిల్ రాజు. ఇప్పుడు అదే దిల్ రాజు పై బహిష్కృత నేత ఆరోపణలు చేయడంతో పవన్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఒక్క దిల్ రాజు కాదు.. ఏకంగా నలుగురిపై ఆరోపణలు చేశారు సత్యనారాయణ. కానీ ఇప్పుడు పవన్ స్పందన ఎలా ఉండబోతుంది అనేది చర్చ.
* రేవంత్ సీఎం అయిన తర్వాత..
తెలంగాణలో రేవంత్ రెడ్డి ( Revanth Reddy)ముఖ్యమంత్రి అయిన తర్వాత టాలీవుడ్లో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పైగా దిల్ రాజు తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నారు. పైగా ఇప్పటివరకు థియేటర్ల బంద్ అనేది జరగలేదు. పైగా దిల్ రాజు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ సినిమాలను ఆపే దమ్ము ఎవరికీ లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామని ఆయన కోరారు. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ థియేటర్ల తనిఖీతో చర్యలు ఆపేస్తారా? లేకుంటే అంతకుమించి ముందుకు వెళ్తారా? అన్నది చూడాలి ఏం జరుగుతుందో.. అన్నింటికీ మించి రేవంత్ మనిషి విషయంలో చర్యలకు సీఎం చంద్రబాబు ఒప్పుకుంటారా అన్నది ఆలోచించుకోవాల్సిన విషయమే.