Single OTT Release: ఈ ఏడాది అతి తక్కువ బడ్జెట్ తో నిర్మితమై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి నిర్మాతలకు, బయ్యర్స్ కి కాసుల కనక వర్షం కురిపించిన చిత్రాల్లో ఒకటి ‘సింగిల్'(#Single Movie). గీతా ఆర్ట్స్(Geetha Arts) సంస్థ పై శ్రీ విష్ణు(Sree Vishnu) హీరో గా నటించిన ఈ సినిమా లో కేతిక శర్మ(Ketika Sharma), ఇవానా(Ivana) హీరోయిన్స్ గా నటించారు. కేవలం 7 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం విడుదల తర్వాత ఏకంగా 17 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. అంటే దాదాపుగా పది కోట్ల రూపాయిల లాభాలు అన్నమాట. వరుసగా ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న టాలీవుడ్ కి ఈ చిత్రం సరికొత్త ఊపిరి ని అందించింది. అయితే విడుదలకు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది.
థియేట్రికల్ రన్ పూర్తి అయినా నాలుగు వారాల తర్వాత ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని మేకర్స్ తో ఒప్పందం కుదిరించుకున్నారు. దీంతో ఈ చిత్రాన్ని జూన్ 6 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రీసెంట్ గానే వచ్చింది. అయితే ముందుగానే ఓటీటీ తేదీని ప్రకటించి చాలా పెద్ద తప్పు చేసారని ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్స్ మండిపడుతున్నారు. ఎందుకంటే మంచి థియేట్రికల్ రన్ ఇప్పటికీ వస్తూనే ఉంది. మరో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉన్న సినిమాకు ఓటీటీ విడుదల తేదీని ప్రకటించడం వల్ల చాలా ఎఫెక్ట్ పడిందని అంటున్నారు. ఈ అంశం పై ఇప్పుడు ఇండస్ట్రీ లో పెద్ద చర్చ నడుస్తుంది. ఇకపోతే మే1 న విడుదల అయిన ‘హిట్ 3’, ‘రెట్రో’ చిత్రాలు కూడా అదే రోజున విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే ‘గీత గోవిందం’ చిత్రం తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థకు ఈమధ్య కాలంలో కనీవినీ ఎరుగని భారీ లాభాలను తెచ్చిపెట్టిన చిత్రమిదే. ఈ ఏడాది విడుదలైన ‘తండేల్’ కి కూడా భారీ వసూళ్లు వచ్చాయి కానీ, లాభాలు మాత్రం నామమాత్రంగానే వచ్చాయి. కానీ సింగిల్ చిత్రానికి మాత్రం పెట్టిన ప్రతీ పైసా కి పదింతలు ఎక్కువ వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే జాక్పాట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా భారీ హిట్ అవ్వడం తో శ్రీవిష్ణు తో మరో రెండు ప్రాజెక్ట్స్ చేసేందుకు ఒప్పందాలు కూడా చేసుకున్నాడట అల్లు అరవింద్. శ్రీ విష్ణు కి కూడా తన మార్కెట్ ని భారీ గా పెంచుకునే అవకాశం ఈ చిత్రం తో వచ్చింది. ఆయన కెరీర్ లో ‘సామజవరగమనా’ చిత్రం అతి పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఆ తర్వాతి స్థానం లో సింగిల్ నిల్చింది.