Pawan And Jagan: ఏదైనా చెబితే నమ్మేటట్టు ఉండాలి. ప్రజల్లో నమ్మకం కలిగించాలి. అప్పుడే ప్రజలు మనల్ని నమ్ముతారు. అయితే ఈ విషయంలో రాజకీయ పార్టీల నేతల వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. కొందరు చేసిందే చెబుతారు.. చెప్పిందే చేస్తారు. మరికొందరు మాత్రం వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి పరిస్థితి నిన్న ఏపీలో కనిపించింది. ఏకకాలంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan), మాజీ సీఎం జగన్ రాజకీయ పర్యటనలు చేశారు. కానీ ఇద్దరి మధ్య వైరుధ్యం స్పష్టంగా కనిపించింది. ఒకరు సమస్యపై పోరాటం చేయగా.. మరొకరు సమస్యకు పరిష్కార మార్గం చూపించారు. దానిపై స్పష్టతనిచ్చారు. దీంతో ఇద్దరు పర్యటనలపై ప్రజల్లో బలమైన చర్చ నడుస్తోంది. జగన్ నర్సీపట్నం టూర్కు వెళ్ళగా.. పవన్ ఉప్పాడ లో మత్స్యకారులను పరామర్శించేందుకు వెళ్లారు. కానీ ఇద్దరు ఒక్కోలా వ్యవహరించారు.
* అలా ఎలా ప్రశ్నిస్తారు?
జగన్ ( Y S Jagan Mohan Reddy ) అధికారంలో ఏదైనా శంకుస్థాపన చేస్తే.. గెలిచిన వెంటనే చేయాలని.. ఎన్నికలకు ముందు చేస్తే అది ప్రజలను మోసం చేయడమేనని చెప్పుకొచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి తన పాలన మధ్యలో మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు. 2022 డిసెంబర్లో శంకుస్థాపన చేశారు. కానీ పనులు పూర్తి చేయలేకపోయారు. కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటుతోంది. ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిని తప్పు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఐదేళ్లపాటు చిదిమేసిన విషయాన్ని మరిచిపోతున్నారు. దానిని మరిచి ఇప్పుడు ఎందుకు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టడం లేదు అనే ప్రశ్నకు తాను అనర్హుడు నన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి.
* 100 రోజుల్లో సమస్యకు పరిష్కారం..
ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఉప్పాడ లో ( Uppada )కొద్ది రోజుల కిందట మత్స్యకారులు ఆందోళన చేశారు. రసాయనిక పరిశ్రమలు నుంచి వచ్చే వ్యర్థాలతో మత్స్య సంపద చచ్చిపోతోందని.. తమకు నష్టం కలుగుతోందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. వారిని నేరుగా కలుసుకున్నారు పవన్ కళ్యాణ్. సముద్రంలో వేటకు వెళ్లి చనిపోయిన మత్స్యకారులు 18 మంది కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున.. 19 లక్షల రూపాయలు అందించారు. వారం రోజుల్లో రసాయనక పరిశ్రమల కాలుష్యంపై కమిటీ అధ్యయనం చేయాలని.. ప్రభుత్వానికి నివేదికలు పంపాలని ఆదేశించారు. 100 రోజుల్లో దీనికి ఒక పరిష్కార మార్గం చూపుతామని హామీ ఇచ్చారు. అయితే ఉప్పాడ తీరంలో ఇప్పుడే రసాయనిక పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. గత ప్రభుత్వంలోనే అవి ఏర్పాటయ్యాయి. కానీ ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్కు రాజకీయం చూపింది. దానికి తనదైన శైలిలో స్పందించారు పవన్ కళ్యాణ్. ఇలా ఇద్దరు నేతల రాజకీయ పర్యటనలు భిన్నంగా సాగడం విశేషం.