Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) నర్సీపట్నం టూర్ సక్సెస్ అయ్యిందా? ఆయన అనుకున్నది సాధించారా? ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారా? ప్రజలు ఆయనను ఆహ్వానించారా? ప్రభుత్వ చర్యలను ప్రజలు తప్పుపట్టారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. జగన్ టూర్ సక్సెస్ అయిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా.. జనం లేక ఫెయిల్ అయిందని టిడిపి చెబుతోంది. ఎవరి మీడియాలో వారికి అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా జగన్ కోసం జనం తరలివచ్చారని వైసీపీ చెబుతోంది. అయితే ఎక్కడికి అక్కడే పేటీఎం బ్యాచ్లు ఏర్పాటు చేసుకొని జేజేలు కొట్టించుకున్నారని టిడిపి అనుకూల వర్గం వాదిస్తోంది.
* ఏం సాధించినట్టు?
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు( government medical colleges) ప్రైవేటు పరం చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎండగట్టేందుకు నర్సీపట్నం వచ్చారు. అయితే ఈ బల ప్రదర్శన ఎందుకన్న ప్రశ్న వినిపిస్తోంది. కానీ ఇది బలప్రదర్శన కాదు.. జగన్ పై అభిమానంతో వచ్చిన ప్రజలను చూసి టిడిపి అసూయతో వక్రభాష్యాలు చెబుతోందని వైసిపి సమర్ధించుకుంటోంది. అయితే జగన్ పర్యటనలకు బయలుదేరిన ప్రతిసారి ఇటువంటి వాదనలు సర్వసాధారణంగా మారాయి. ఇదే తరహా ప్రశ్నలు, చర్చ నడుస్తోంది. అయితే జగన్ జనంలోకి వచ్చి ప్రభుత్వం మెడలు వంచగలిగారా? రాజకీయంగా పై చేయి సాధించారా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా మేలు జరిగిందా? అంటే మాత్రం మౌనమే సమాధానం అవుతోంది. కానీ వైసీపీ అదే పనిగా సక్సెస్ అనే మాట చెబుతోంది.
* జనం సర్వసాధారణం..
జగన్ పర్యటనలకు జనాలు రావడం గత 15 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. కానీ జనం ఆదరించింది ఆయనకు ఒక్కసారే. ఇప్పుడు కూడా జనం వస్తున్నారే తప్ప రాజకీయంగా ఎంతవరకు మద్దతు చెబుతున్నారు అన్నది అంచనా వేయలేకపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆపరేషన్ సక్సెస్ బట్ పేషంట్ డెడ్ అన్నట్టు మాదిరిగా ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కేవలం పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం వల్లే జగన్ పర్యటనకు హైప్ వచ్చిందే తప్ప.. జగన్ పర్యటనలకు వచ్చే జనం చూసి కాదన్నట్టు ఒకటాక్ నడుస్తోంది. పైగా నర్సీపట్నం పర్యటనలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక సీన్ క్రియేట్ అయింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వ వేధింపులతో డాక్టర్ సుధాకర్ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన ఫోటోలతో దళిత సంఘాలు జగన్ గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారు. గతంలో ఇటువంటి సీన్లు ఉండేవి కాదు. ఏకపక్షంగా జగన్ పర్యటనలు సాగేవి. కానీ ఈసారి అలా ఉండదు. జగన్ ఎక్కడికి వెళ్లినా.. ఏ పర్యటనలు చేసినా.. ఇలాంటి వ్యతిరేక కార్యక్రమాలు క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఐదేళ్ల పాలన వైఫల్యాలు ఇదే పర్యటనల్లో తిప్పికొట్టే అవకాశం ఉంది.