Comedian Ali :సినీ పరిశ్రమలో స్నేహంగా ఉండే వారిలో పవన్, అలీ ఒకరు. వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు. పవన్ తో అలీ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. పవన్ సినిమాల్లో తప్పకుండా అలీ ఉంటారు.వీరిద్దరి మధ్య చక్కటి అనుబంధం కూడా ఉంది.అయితే వీరిద్దరిని రాజకీయాలు వేరు చేశాయి. పవన్ జనసేన ఉండగా.. అలీ సడన్ గా జగన్ కు జై కొట్టారు. జనసేన పై తీవ్ర విమర్శలు కూడా చేశారు. అటు తరువాత ఇద్దరూ కలవడం అరుదుగా కూడా మారింది. అయితే ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో అలీ రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కు అలీ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. అయితే వైసీపీలో ఉంటూ అలీ వ్యవహార శైలి అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల కోసం మంచి స్నేహితుడిని వదులుకోవడం కరెక్ట్ కాదని పవన్ అభిమానులు తప్పుపట్టారు. అలీ వైఖరిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో ఆ పార్టీకి దూరమయ్యారు అలీ. ఇటీవల పవన్ కు అనుకూలంగావ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే పవన్ అభిమానులు మాత్రం దీనిని నమ్మడం లేదు. అలీ ఎక్కడ కలిసినా టార్గెట్ చేస్తున్నారు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసమే అలీ యూటర్న్ తీసుకున్నారని.. పవన్ అభిమానించడం ప్రారంభించారన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. కానీ అలీ ఇవన్నీ పట్టించుకునే స్థితిలో లేరు. ప్రస్తుతం ఆయన ముందు కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. వరుసగా సినిమాలు చేస్తున్నారు. టీవీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
* ఆయన స్థానం ప్రత్యేకం
తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంతమంది యువ కమెడియన్లు వచ్చినా.. అలీ స్థానం మాత్రం ప్రత్యేకమైనది. గత నాలుగున్నర దశాబ్దాలుగా కమెడియన్ గా ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నారు. చిత్ర విచిత్రమైన భాష, వింత శబ్దాలతో ఆకట్టుకుంటారు. జంధ్యాల చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేసిన అలీ.. తరువాత కాలంలో ఎస్వీ కృష్ణారెడ్డి, ఇవివి సత్యనారాయణ లాంటి దర్శకులు తీసిన చిత్రాల్లో మెప్పించారు. పూరి జగన్నాథ్ అయితే అలీ కోసం ప్రత్యేక పాత్రలు రూపొందించి.. నేటితరం ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు. అలీని లక్కీ హ్యాండ్ గా పరిగణిస్తారు పూరి జగన్నాథ్. ప్రతి సినిమాలో ఆయన కోసం ప్రత్యేక క్యారెక్టర్ సృష్టిస్తారు.
* రాజకీయాలపై ఇంట్రెస్ట్
సినిమాలతో పాటు రాజకీయాలు అన్న అలీకి చాలా ఇష్టం. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభల్లో అడుగుపెట్టాలని ఎక్కువగా భావించారు. కానీ టిడిపిలో ఛాన్స్ దక్కలేదు. 2019లో అనూహ్యంగా వైసీపీలో చేరారు. అక్కడ కూడా అవకాశం దక్కలేదు. ఆ ఎన్నికల్లో ప్రచారానికి పరిమితమయ్యారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి అందుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా జగన్ చాన్స్ ఇవ్వలేదు. వైసిపి ఓడిపోవడమే కాదు జనసేన పోటీ చేసిన స్థానాల్లో గెలిచింది. దీంతో అలీలో ఒక రకమైన మార్పు ప్రారంభమైంది. వైసీపీకి రాజీనామా చేయడమే కాదు పవన్ కు అనుకూల వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు అలీ.
* పవన్ పట్ల సానుకూలం
మొన్న ఆ మధ్యన సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోకు అలీ హాజరయ్యారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరితో నటించాలని ఉందని చెబితే.. మారు మాట చెప్పకుండా పవన్ కళ్యాణ్ పేరు చెప్పారు అలీ. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందిన డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో అలీ నటించారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం విశాఖలో జరిగింది. అలీ హాజరయ్యారు. ముఖ్యంగా పవన్ అభిమానులు ఈలలు కేకలతో రచ్చ చేశారు. పవన్ అభిమాని లో ఒకరు యాంకర్ వద్ద మైక్ తీసుకుని… నేరుగా అలీనే అడిగారు. పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు సినిమా చేస్తారని ప్రశ్నించారు. మీరు లేకుండా పవర్ స్టార్ సినిమాను ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది సార్.. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాలో మీరు జాయిన్ అవ్వాలి. మళ్లీ మీరు పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీయాలి.. అనేసరికి అలీ స్పందించాడు. చిరునవ్వులు చిందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More