Jio 5g Mobile: భారత అపర కుభేరుడు ముఖేష్ అంబానీ గురించి నిన్నటి వరకు చర్చ సాగింది. ఆయన కుమారుడు అనంత్ అంబానీ మ్యారేజ్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా అంబానీ తన కుమారుడి పెళ్లిని ఘనంగా చేశాడు. ఈ సందర్భంగా పెళ్లికి వచ్చిన వారికి ఖరీదైన బహుమతులు కూడా అందించాడు. అయితే ఓ వైపు పెళ్లి కార్యక్రమం ముగియకుండానే ముఖేష్ అంబానీకి చెందిన జియో వినియోగదారులపై ఛార్జీల మోత విధించాడు. వివిధ రకాల జియో ప్లాన్ల రేట్లపు పెంచడంతో వినియోగదారులు షాక్ అయ్యారు. దీంతో చాలా మంది జియో నుంచి BSNL కు ఫోర్ట్ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇదే అదనుగా భావించిన బీఎస్ఎన్ ఎల్ సైతం తమ వినియోగదారులు తిరిగి మారకుండా ఉండడానికి 5జీ సేవలను త్వరలో ప్రారంభిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఎస్ ఎన్ ఎల్ కు మారిన వారు తిరిగి జియోకు రావడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఈ తరుణంలో జియో కంపెనీ కొత్త ఫోన్ ను ఆవిష్కరించింది. త్వరలో మార్కెట్లోకి ఏకంగా 5జీ ఫోన్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పిక్స్, ఫీచర్స్ ఆన్ లైన్ లోకి రావడంతో కొంత మంది వినియోగదారులు ఈ ఫోన్ పై ఆసక్తి చూపుతున్నారు. ఓ వైపు కీ ప్యాడ్ ను ఇచ్చి టచ్ స్క్రీన్ ను ఇచ్చిన ఈ మొబైల్ చూడడానికి ఆకర్షణీయంగా ఉంది. అంతేకాకుండా దీని ధర కూడా తక్కువగా ఉండడంతో దీని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇంతకీ ఈ ఫోన్ వివరాలు ఎలా ఉన్నాయంటే?
ముఖేష్ కు చెందిన జియో నుంచి తక్కువ ధరకే ఫోన్లను తీసుకురావడం ఇది కొత్తేమీ కాదు. మొదట్లో కేవలం రూ.1500తో ఏడాది పాటు ఉచిత కాల్స్ తో జియో ఫోన్ ను అందించారు. ఆ తరువాత రూ. 3వేలకు స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు చాలా మంది స్మార్ట్ ఫోన్ కు మారిపోయారు. మరోవైపు 5 జీ సేవలు అందుబాటులోకి రావడంతో 5 జీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే 5జీ మొబైల్ రూ. 15 వేలకు పైగానే ఉంది. ఆ లోపు ధరతో అందుబాటులో ఉన్నా ఫీచర్స్ లో తేడా ఉంటున్నాయి.
ఈ తరుణంలో జియో నుంచి 5 జీ మొబైల్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ తో కలిగి ఉంది. ఇందులో 144Hz రిప్రెష్ రేట్ సపోర్టు చేస్తుంది. దీని డిస్ ప్లే 6.7 అంగుళాలు ఉంటుంది. మొబైల్ లో మంచి కెమెరా కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ అని అంటున్నారు. ఇందులో 100 మెగా పిక్సెల్ కెమెరాను అమర్చారు. 16 ఎంపీ ఆల్ట్రావైడ్ కెమెరాను చూడొచ్చు. సెల్పీ కెమెరాతో పాటు వీడియోల కోసం 32 మెగా పిక్సెల్ వాడుకోవచ్చు.ఈ మొబైల్ లో 6700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ల పాస్ట్ చార్జింగ్ సపోర్టు చేయనుంది.
కొత్త 5జీ జియోఫోన్ లో 8 జీబీ ర్యామ్, 128 జీబి స్టోరేజ్ ఉన్నాయి. దీనిని రూ.5,999 నుంచి రూ.6,999లకు విక్రయించే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ గురించి జియో కంపెనీ ఎటువంటి సమాచారం అధికారికంగా ప్రకటించలేదు. కానీ దీనిని మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే దీనిని మార్కెట్లోకి తీసుకొస్తే మాత్రం మిగతా 5జీ మొబైల్స్ పై ప్రభావం పడే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More