KA Paul: ఏం చెప్పావయ్యా… ‘బాబు’ కంటే ‘పాల్’ బెటర్.. భలే లాజిక్ గా మాట్లాడాడే.. వీడియో వైరల్

ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై పాల్ సంచలన విమర్శలు చేశారు. " జైలు శిక్ష నుంచి తప్పించుకోవడం కోసం సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు నాయుడు పథకాలను తెరపైకి తీసుకువచ్చారు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 3, 2024 1:40 pm

KA Paul

Follow us on

KA Paul: దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువు దీరింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయింది (8 నెలల క్రితమే). ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రంలో కొనసాగుతున్నారు. ఎన్నికల సమయంలో నాయకులు పోటాపోటీగా విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం.. కానీ ఏపీలో ఎన్నికలు మూసిన తర్వాత కూడా రాజకీయ వాతావరణం ఏమాత్రం మారడం లేదు. పైగా రాజకీయ నాయకులు ఎన్నికలను మించి విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో మీడియాకు కావలసినంత మసాలా దొరుకుతోంది. అయితే ఈ జాబితాలో అందరి నాయకుల కంటే ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ముందు వరుసలో ఉండడం విశేషం. వాస్తవానికి మీడియా అతడిని ఒక జోకర్ లాగా మార్చింది గాని.. ఒకప్పుడు కే ఏ పాల్ మీడియాలో ప్రముఖంగా కనిపించేవారు. సువార్త బోధకుడిగా ఆయనకు విశేషమైన పేరు ఉండేది. అప్పట్లో ఓ ముఖ్యమంత్రి తన అల్లుడి కోసం కేఏ పాల్ ను తొక్కేశారని ఆరోపణలు ఉన్నాయి.. ఇక అప్పటినుంచి పాల్ ఫేడ్ అవుట్ అయిపోయారు. దానికి ఆయన వ్యాఖ్యలు కూడా తోడు కావడంతో జనాల్లో చులకనయ్యారు. ఫలితంగా ఆయన పేరు ప్రఖ్యాతలు మొత్తం పడిపోయాయి. అయినప్పటికీ కెఏ పాల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా తన డిఫరెంట్ స్టైల్, మేనరిజంతో విచిత్రమైన విమర్శలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నారు.

ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై పాల్ సంచలన విమర్శలు చేశారు. ” జైలు శిక్ష నుంచి తప్పించుకోవడం కోసం సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు నాయుడు పథకాలను తెరపైకి తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు వాటిని అమలు చేయలేదు. పైగా వాటి అమలుకు సంబంధించి రకరకాల సాకులు చెబుతున్నారు. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతమంది బిలినియర్లను తీసుకొచ్చాను. శాంతి సభలు పెట్టాను. లక్షలాదిమందిని సమీకరించాను. అప్పట్లో నేను 150 మంది ఎంపీలను రమ్మంటే 300 మంది దాకా వచ్చారు. నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు.. ఇప్పుడు శాంతి సభలు నిర్వహించేందుకు ఎవరూ అనుమతి ఇవ్వడం లేదు. దీనిపై నేను కోర్టుకు వెళ్తాను. కోర్టు ద్వారా అనుమతులు తెచ్చుకుంటాను.. తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఫ్లాప్ అయ్యాడు. ముఖ్యమంత్రి గా 8 నెలల నుంచి పనిచేస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం లేదు. తెలుగువాడి పౌరుషాన్ని చంద్రబాబు నాయుడు చూపించలేకపోతున్నారు. నాడు నరేంద్ర మోడీని తిట్టారు. పెళ్లి చేసుకొని భార్యను వదిలిపెట్టాడని అన్నారు. చివరికి ఇప్పుడు మోదీని బతిమిలాడుతున్నారు.. ఓ సీనియర్ ఎన్టీఆర్, పీవీ నరసింహారావు, కేఏ పాల్ ను చూసి నేర్చుకోవాలి. తెలుగువాడి పౌరుషాన్ని చూపించాలని” పాల్ వ్యాఖ్యానించారు.

గతంలో పాల్ మాట్లాడిన మాటలను పెద్దగా ప్రసారం చేయని సాక్షి.. ప్రస్తుతం అతడికి విపరీతమైన కవరేజ్ ఇస్తోంది. పాల్ మాట్లాడిన వీడియోలను వైసీపీ అనుకూల నెటిజెన్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రసారం చేస్తున్నారు.. టిడిపిని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే సమయంలో టిడిపి అనుకూల నెటిజన్లు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.. మొత్తానికి ఎన్నికలకు మించి సోషల్ మీడియాలో అటు టిడిపి, ఇటు వైసిపి మధ్య యుద్ధం జరుగుతోంది.