Homeఆంధ్రప్రదేశ్‌Other State Leaders On AP Politics: ఏపీ రాజకీయాలపై ఇతర రాష్ట్రాల నేతల అమితాసక్తి

Other State Leaders On AP Politics: ఏపీ రాజకీయాలపై ఇతర రాష్ట్రాల నేతల అమితాసక్తి

Other State Leaders On AP Politics: ఏ రాష్ట్రంలోనైనా రాజకీయం ప్రతిపక్షం చేస్తుంది. అధికారపక్షం తీరును ఎండగడుతుంది. ఏపీలో మాత్రం ఆ పరిస్థితి విభిన్నం. 39 శాతం ఓటు బ్యాంకు ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం కోసం గట్టిగానే పోరాటం చేస్తోంది. హోదా వస్తే కానీ సభకు వచ్చి ప్రజా సమస్యలు ప్రస్తావించలేనని చెప్పి తప్పుకుంది. ప్రెస్ మీట్ లు, సోషల్ మీడియాలో పోస్టులకు పరిమితం అవుతుంది. అయితే ఇక్కడ రాజకీయ శూన్యతను భర్తీ చేస్తున్నారు ఇతర ప్రాంతాల వారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఘోర తప్పిదాలు జరిగితే ప్రశ్నించని వీరు.. ఇప్పుడు మాత్రం అదే పనిగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలపై విశ్లేషణలు, విమర్శలు మాత్రం పురుగు రాష్ట్రాల నేతలు, ఇతర ప్రాంతాలకు చెందిన మేధావుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అంతా పక్క రాష్ట్రం వారే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే పోరాటం చేయనని మారం చేస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే ప్రొఫెసర్ నాగేశ్వర్, నటుడు ప్రకాష్ రాజ్, తెలంగాణ నేత కేటీఆర్, ఘంటా చక్రపాణి, తెలకపల్లి రవి వంటి వారు ఏపీ రాజకీయాల కోసం విపరీతమైన విశ్లేషణ చేస్తున్నారు. అది కూడా వన్ సైడ్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బూతులు మాట్లాడినప్పుడు, ఘోరాతి ఘోరమైన రాజకీయాలు చేసినప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు తెరవలేదు. పైగా లోకమంతా భయపడి ఆందోళన చెందిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి మేధావులు అడ్డగోలుగా సమర్ధించారు. ఏపీలో రాజకీయ అస్తిత్వాన్ని సృష్టించేందుకు సరికొత్త విశ్లేషణలు చేస్తున్నారు. ఆధారాలు లేని వాటిని లీకులుగా బయటపెడుతున్నారు. వాటిపై కేసులు పెడుతుంటే ఊహానా మేధావుల రూపంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల నుంచి ఏపీ రాజకీయాలపై విశ్లేషణలు చేస్తున్నారు.

ప్రజల సమస్యలపై కాకుండా..
ప్రస్తుతం మేధావుల ముసుగులో జరుగుతున్న చర్చలు అర్థవంతంగా లేవు. పోనీ ప్రజలు ఎదుర్కొంటున్న పెన్షన్లు, రోడ్లు, ఉద్యోగ ఉపాధి సమస్యల గురించి మీరు ప్రస్తావించడం లేదు. అమరావతి పై విషం కక్కుతుంటే ఈ మేధావులకు కనిపించడం లేదు. ఏపీలో ప్రతిపక్షం ఉందా లేదా అన్నట్టు ఉంది. హైదరాబాదులో కూర్చున్న నేతలు, మేధావులు ఏపీ రాజకీయాలపై రియాక్ట్ అవుతున్నారు. దీని వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందన్నది బహిరంగ రహస్యం. తప్పకుండా తన బాధ్యతను మరిచి వేరొకరికి అప్పగించినట్టు ఉంది వైసీపీ పరిస్థితి. ప్రభుత్వం చేసే పనుల్లో లోపాలుంటే సరిదిద్దాల్సిన బాధ్యత ప్రతిపక్ష వైసిపిది. కానీ ఆ బాధ్యత నుంచి తప్పుకొని వేరే రాష్ట్రాల నేతలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్పగించినట్లు ఉంది. ఇది ప్రజల్లోకి బలంగా వెళితే మాత్రం నష్టం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

West Indies vs Pakistan

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....
Jogi Ramesh

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...
Bonda Umamaheswara Rao

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...
Loan Advice

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...
Oktelugu Epaper