https://oktelugu.com/

AP New CS : ఏపీకి కొత్త సిఎస్.. ఆ ఐఏఎస్ అధికారికి ఛాన్స్.. నేడు ఉత్తర్వులు!

రాష్ట్రానికి కొత్త సిఎస్ పేరును ప్రకటిస్తూ ఈరోజు ఉత్తర్వులు రానున్నాయి. ఇద్దరు ఐఏఎస్ అధికారుల మధ్య పోటీ నెలకొంది. అయితే సర్వీస్ తక్కువగా ఉన్న ఓ అధికారిని ఖరారు చేసినట్లు సమాచారం.

Written By: , Updated On : December 29, 2024 / 09:22 AM IST

AP New CS

Follow us on

AP New CS : ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ఎవరనేది దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం అనివార్యంగా మారింది. ప్రధానంగా ఇద్దరు అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ లలో ఒకరికి అవకాశం దొరుకుతుందని ప్రచారం జరిగింది. చివరిగా విజయానంద్ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ఈరోజు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఎం చంద్రబాబు విజయానంద్ వైపే మొగ్గు చూపడంతో.. ఆయన పేరు దాదాపు ఖరారు అయినట్టే.

* సీనియర్ ఐఏఎస్ అధికారి
విజయానంద్ 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2022 ఫిబ్రవరి నుంచి ఏపీ జెన్కోకి చైర్మన్ గా, 2023 ఏప్రిల్ నుంచి ఏపీ ట్రాన్స్కో కు సీఎండీగా ఉన్నారు. 1993లో అసిస్టెంట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ గా, ఆదిలాబాద్, శ్రీకాకుళం కలెక్టర్ గా వ్యవహరించారు. 2016 నుంచి 2019 వరకు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ గా పనిచేశారు. 2019 నుంచి 2021 వరకు ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించారు. ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు.

* సాయి ప్రసాద్ కు తర్వాత
సీనియర్ ఐఏఎస్ అధికారుల జాబితాలో చాలామంది ఉన్నారు. ముందుగా సాయి ప్రసాద్ పేరును ఖరారు చేసినట్లు ప్రచారం నడిచింది. అయితే ఆయనకు ఇంకా సర్వీసు ఉంది. విజయానంద్ మాత్రం వచ్చే ఏడాది నవంబర్లో పదవీ విరమణ చేస్తారు. సాయి ప్రసాద్ కు 2026 వరకు సర్వీస్ ఉంది. అందుకే సీఎం చంద్రబాబు విజయానంద్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. అందుకు సంబంధించి ఉత్తర్వులు ఈరోజు రానున్నాయి.