https://oktelugu.com/

AP Government : ఆ పెన్షన్లకు కోత.. ముహూర్తం ఫిక్స్ చేసిన ఏపీ సర్కార్!

ఏపీలో సామాజిక పింఛన్ల అంశంపై దృష్టి పెట్టింది సర్కార్. కొత్త పింఛన్లు అందించడానికి ముందు.. ఫేక్ పింఛన్లు తొలగించాలని డిసైడ్ అయ్యింది.

Written By:
  • Dharma
  • , Updated On : December 29, 2024 / 09:14 AM IST

    ineligible Pensions

    Follow us on

    AP Government : కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పింఛన్ల విషయంలో దృష్టి సారించింది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో అనర్హులకు భారీ ఎత్తున పింఛన్లు అందించినట్లు గుర్తించింది. వాటి లెక్కలు తేల్చేందుకు ఇప్పుడు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జనవరి 3 నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు నిర్ణయించింది. అర్హత లేకపోయినా అక్రమంగా సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్న వారిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే నకిలీ రేషన్ కార్డుల ఏరివేతకు పైలెట్ ప్రాజెక్టుగా చేసుకొని డ్రైవ్ నిర్వహించింది. ఇప్పుడు అక్రమంగా పెన్షన్లు తీసుకుంటున్న వారిపై ఫోకస్ పెడుతోంది.ప్రధానంగా దివ్యాంగుల పెన్షన్ల పై దృష్టి పెట్టింది. తప్పుడు మెడికల్ ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు తీసుకుంటున్న వారి ఏరువేతకు డ్రైవ్ నిర్వహించబోతోంది.

    * ఫేక్ సర్టిఫికెట్ల పరిశీలన
    వైసిపి ప్రభుత్వ హయాంలో ఫేక్ సర్టిఫికెట్లతో చాలామంది దివ్యాంగ పింఛన్లు పొందారు. కొంతమంది వైద్యులు డబ్బులకు కక్కుర్తి పడి అటువంటి సర్టిఫికెట్లను జారీ చేశారు. అయితే వారిని గుర్తించేందుకు జనవరి 3 నుంచి ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది ఏప్రిల్, మీ వరకు ఈ పరీక్షలు కొనసాగా పోతున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు కొత్తవారికి వైకల్య ధ్రువపత్రాల జారీని ప్రభుత్వం నిలిపివేయనుంది. మరోవైపు తప్పుడు సదరం సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యులపై సైతం చర్యలకు ఉపక్రమించనుంది.

    * ప్రయోగాత్మక సర్వే
    అనర్హుల పింఛన్లను గుర్తించేందుకు ఇదివరకే ప్రభుత్వం ప్రయోగాత్మకంగా సర్వే చేపట్టింది. ప్రతి జిల్లాలో కొన్ని సచివాలయాలను ఇందుకు ఎంపిక చేసింది. అక్కడ క్షుణ్ణంగా పింఛన్లను పరిశీలించింది. ఈ క్రమంలో ఫేక్ సర్టిఫికెట్లు వెలుగులోకి వచ్చాయి. అందుకే రాష్ట్రమంతటా ఈ స్పెషల్ డ్రైవ్ కి ఉపక్రమించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఫేక్ సర్టిఫికెట్లతో పింఛన్లు పొందుతున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.