YCP: పాపం జగన్.. ప్రతిపక్ష హోదా డౌటే..

చట్టసభల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే పది శాతం సభ్యులు విధిగా ఉండాలి. 175 అసెంబ్లీ సీట్లు ఉన్న ఏపీలో ప్రతిపక్ష హోదాకు 18 సీట్లు సాధించడం అవసరం.

Written By: Dharma, Updated On : June 8, 2024 4:46 pm

YCP

Follow us on

YCP: ఎన్నికలు అన్నాక గెలుపోటములు సహజం. గెలిస్తే ప్రాధాన్యం పెరుగుతుంది. ఓటమి పలకరిస్తే తగ్గుతుంది. ఇది సహజ చర్య.ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇది స్పష్టమైంది. ఇప్పటివరకు హౌస్ లో పాలక పక్ష నేతగా ఉన్న ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ఆయన అసెంబ్లీలో ఎక్కడ కూర్చుంటారు? ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది? భద్రత కూడా ఏ స్థాయిలో ఉంటుందన్న చర్చ ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ప్రతిపక్ష హోదా దక్కాలంటే ప్రభుత్వ నిర్ణయం పైనే ఆధారపడి ఉంది. స్పీకర్ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్ష నేత హోదా జగన్ కు ఇవ్వవచ్చు. కానీ ఇస్తారా అంటే? ఎవరనే సమాధానం వినిపిస్తోంది.

చట్టసభల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే పది శాతం సభ్యులు విధిగా ఉండాలి. 175 అసెంబ్లీ సీట్లు ఉన్న ఏపీలో ప్రతిపక్ష హోదాకు 18 సీట్లు సాధించడం అవసరం. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకి పరిమితం అయ్యింది. అందులో నలుగురు సభ్యులు వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో సంఖ్యా బలం 19కి పడిపోయింది. మరో ఇద్దరిని చేర్చుకునేందుకు అప్పట్లో ప్రయత్నం జరిగినా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు వైసిపి కేవలం 11 స్థానాలకు పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా దక్కే అవకాశమే కనిపించడం లేదు. ప్రతిపక్ష హోదా వల్ల కొన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. అసెంబ్లీలో కూడా సీట్ల కేటాయింపులు విపక్షానికి ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా పిఎస్, పిఏ తో పాటు సిబ్బంది అలవెన్సులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. మంత్రి స్థాయిలో క్యాబినెట్ సదుపాయాలు కూడా ఉంటాయి.

శాసనసభ సంప్రదాయాలు ప్రకారం ప్రతిపక్ష నేతకు ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. స్పీకర్ అనేక సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించడం ఆనవాయితీగా వస్తుంది. సభలో వివిధ అంశాలపై ప్రశ్నలు వేయడానికి కూడా ప్రధాన ప్రతిపక్ష నేతకు ప్రాధాన్యత ఉంటుంది. సభలో బిల్లులపై చర్చించే అంశంలో కూడా సంఖ్యా బలాన్ని బట్టి సమయం కేటాయిస్తారు. అయితే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో.. జగన్ కు ప్రాధాన్యం తగ్గిపోతుంది. నిబంధన ప్రకారం అసెంబ్లీలో మాట్లాడే సమయం కూడా నిమిషాల కంటే ఎక్కువగా ఉండకపోవచ్చు అని తెలుస్తోంది.

అయితే ప్రతిపక్ష హోదా విషయంలో, ప్రాధాన్యత విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు వెసులుబాటు ఉంది. జగన్కు శాసనసభలో సీటు ఎక్కడా కేటాయించాలని అంశంపై నిర్ణయం తీసుకునే విచక్షణ అధికారం స్పీకర్ ది. అయితే ఇప్పటివరకు ప్రతిపక్ష నేతలహోదా విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాలేదు. 2014లో 67 స్థానాలతో ప్రతిపక్షానికి వైసీపీ పరిమితం అయింది. 10% సీట్లు దక్కకపోవడంతో ప్రతిపక్ష హోదాను దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయిన విధంగా 23 స్థానాలతో ప్రతిపక్ష హోదాను దక్కించుకున్నారు చంద్రబాబు. కానీ జగన్ విషయంలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. అయితే హౌస్ లో సజావుగా నడపాలనుకుంటే స్పీకర్ కొన్ని రకాల విచక్షణ అధికారాలు వినియోగించుకునే అవకాశం ఉంది. మరి కొత్తగా స్పీకర్ ఎవరు అవుతారు? జగన్ విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.