AP Politics : మేమొస్తామంటే.. వద్దంటున్నావే.. టిడిపిలోకి మాజీలు క్యూ.. చంద్రబాబు స్పందించకపోవడానికి కారణమేంటి?

ప్రధానంగా వ్యాపారాలు చేసుకునే వైసీపీ నేతలు ఇప్పుడు టిడిపి వైపు ఆశగా చూస్తున్నారు. విశాఖకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు విద్యాసంస్థలు ఉన్నాయి. వాటిని కాపాడుకునేందుకే ఆయన వైసీపీలోకి వెళ్లారు. అప్పట్లో జగన్ సర్కార్ ఆ విద్యా సంస్థలను టార్గెట్ చేసుకోవడంతోనే భయపడి టిడిపిని వీడారు. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు కూడా చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండడంతో అనేక వివాదాలు కొనసాగుతున్నాయి

Written By: Dharma, Updated On : July 15, 2024 10:34 am
Follow us on

AP Politics :  తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో 23 మంది మాత్రమే టిడిపి నుంచి గెలిచారు. అందులో నలుగురు వైసీపీలో చేరారు. వాసుపల్లి గణేష్ కుమార్, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ మోహన్, కరణం బలరాంలు అప్పట్లో టిడిపిని వీడారు. అయితే వీరంతా తెలుగుదేశం పార్టీలోనే సుదీర్ఘకాలం సాగారు. తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో అందరూ ఓడిపోయారు. అందుకే తిరిగి టిడిపి గూటికి చేరేందుకు డిసైడ్ అయ్యారు. ఇందులో వల్లభనేని వంశీ మోహన్ తప్పించి.. మిగతా ముగ్గురు తాము పార్టీలోకి వచ్చేస్తామని టిడిపి సీనియర్లతో రాయభారాలు నడుపుతున్నారు. అయితే చేరికల విషయంలో టిడిపి నాయకత్వం ఫుల్ క్లారిటీతో ఉంది. అటువంటివారిని చేర్చుకోకూడదని తీర్మానించింది.

ప్రధానంగా వ్యాపారాలు చేసుకునే వైసీపీ నేతలు ఇప్పుడు టిడిపి వైపు ఆశగా చూస్తున్నారు. విశాఖకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు విద్యాసంస్థలు ఉన్నాయి. వాటిని కాపాడుకునేందుకే ఆయన వైసీపీలోకి వెళ్లారు. అప్పట్లో జగన్ సర్కార్ ఆ విద్యా సంస్థలను టార్గెట్ చేసుకోవడంతోనే భయపడి టిడిపిని వీడారు. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు కూడా చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండడంతో అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆయన సైతం భయపడిపోతున్నారు
. ఫలితాలు వచ్చిన తరువాత నుండే ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ టిడిపి నుంచి అంత సానుకూలత రావడం లేదు. గంటా శ్రీనివాసరావు వద్దని వారిస్తున్న ఆయన సన్నిహితుడు ఒకరు వైసీపీలో చేరారు.ఇప్పుడు ఆయన సైతం వెనక్కి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ విశాఖ నేతలు విషయంలో టిడిపి నుంచి అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయి.

మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టిడిపిలో చేరేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఆయనకు విద్యాసంస్థల తో పాటు వ్యాపారాలు ఉన్నాయి. గతంలోఅవే వ్యాపారాలను టార్గెట్ చేసుకోవడంతో ఆయన టిడిపిని వదిలి వైసిపి లోకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు అదే భయంతో తిరిగి టిడిపిలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కరణం బలరాం కు చాలా రకాల ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. చీరాల టిక్కెట్ను కేటాయించి ప్రోత్సహించారు. టిడిపి నుంచి గెలిచిన బలరాం వైసీపీలో చేరారు. ఆయనకు గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. వాటిపై టార్గెట్ చేస్తూ టిడిపి నుంచి వైసీపీలోకి రప్పించారు. ఎన్నికల్లో బలరాం కుమారుడు వెంకటేష్ చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వ్యాపార పరంగా ఇబ్బందులు తప్పవని భావిస్తున్న బలరాం టిడిపిలో చేరేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. టిడిపి నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే మద్దాలి గిరికి అసలు సీటు ఇవ్వలేదు జగన్. ఇప్పుడు మద్దాలి గిరి సైతం టిడిపిలో చేరేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ టిడిపి నుంచి ఆ స్థాయిలో భరోసా దక్కడం లేదు.

తెలుగుదేశం పార్టీలో చేరికల విషయంలో చంద్రబాబు కఠినంగా ఉన్నారు. గతంలో పార్టీని విడిచిపెట్టి వెళ్లిన వారు తిరిగి చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు విడిచి పెట్టే నేతల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు చంద్రబాబు. అయితే చాలా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్లు వైసీపీ నుంచి చేరికలకు ప్రోత్సహిస్తున్నారు. వివిధ కారణాలతో వైసీపీలోకి వెళ్లిన తమ అనుచరులను తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అధినేత గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఈ చేరికల విషయంలో నేతలు సతమతమవుతున్నారు.