
బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ఎవరో చేసిన తప్పుకు ఎవరో బాధ్యులు కావాల్సి వస్తోంది. తమ గ్రూపులో వచ్చే వీడియోలపై అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో అశ్లీల వీడియోను చూడాల్సి వచ్చింది. దీంతో మహిళలు నివ్వెరపోయారు. జరిగిన దారుణంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పైగా అది స్వయం సహాయక సంఘాలను సమన్వయం చేసే పర్యవేక్షకుల వాట్సాప్ గ్రూపు కావడంతో అందరు వీక్షించారు. అదే పెద్ద మోసానికి దారి తీసింది. అసలు అధికారులు ఏ మేరకు పని చేస్తున్నారో ఇట్టే తెలిసిపోతోంది. తమ గ్రూపులో ఏ వీడియో వస్తే దాన్ని పోస్టు చేయడంలో ఉన్న ఉత్సాహం దాని గురించి తెలుసుకోవడంలో లేకపోయిందని తెలుస్తోంది.
కృష్ణ జిల్లా చాట్రాయి మండలంలో ఈ వింత చోటుచేసుకుంది. మహిళల వాట్సాప్ గ్రూపులో వచ్చిన వీడియోను చూడడంతో ఖంగుతిన్నారు. అందులో అందరు మహిళలే ఉండడంతో వారికి ఆశ్చర్యం వేసింది. నీలి వీడియోను పోస్టు చేయడంపై అందరిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సామాజిక మాధ్యమాలు కొత్త పుంతలు తొక్కుతున్న క్రమంలో అధికారుల లీలలతో మహిళలు నివ్వెరపోవాల్సిన సంగతి తెలిసిందే. ఇది మండలంలో చర్చనీయాంశం అయింది.
పొరపాటున అభ్యంతరకర వీడియో గ్రూపులో పంపినట్లు పేర్కొంూ వెలుగు అధికారి సహచరులకు తక్షణమే క్షమాపణలు చెబుతూ పోస్టు చేశారు. ఇదే విషయంపై ఏపీఎం బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాత్రి సమాచారాన్ని గ్రామ సమాఖ్యలకు పంపుతున్న క్రమంలో తనకు ఎవరో పంపిన వీడియో పొరపాటున సంఘాల గ్రూపునకు చేరడంతో కలకం రేగింది. దీనిపై అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియో ఎలా వచ్చిందో తెలియడం లేదని తెలుస్తోంది.
తాను తప్పు చేయకపోయినా కొందరు చేసిన తప్పుడు పనికి తాను అపఖ్యాతి పాలయ్యానని వాపోయారు. దీంతో మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మహిళా గ్రూపులో ఇలాంటి పిచ్చి పోస్టుల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీలి చిత్రాల తతంగంపై అందరిలో అనుమానాలు వస్తున్నాయి. మహిళా గ్రూపులో అశ్లీ చిత్రాల పోస్టుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు